Share News

ABN Effect: చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్‌పై కేసు..

ABN , Publish Date - Dec 03 , 2024 | 08:33 AM

ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్‌ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్‌తో షూట్ చేశాడు.

ABN Effect: చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్‌పై కేసు..

ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) చిన్న వెంకన్న ఆలయం (Chinna Venkanna Temple)పై డ్రోన్ కలకలం (Drone Kalakalam) రేపింది. ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌ (YouTuber)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరణ చేశాడు. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ అంశాన్ని ఏబీఎన్ ఆంద్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆలయ అధికారులు స్పందించారు. దానివల్ల ఆలయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆలయ ఏఈవో యూట్యూబర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.


ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్‌ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్‌తో షూట్ చేశాడు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

అమరావతి 2.0 పనులు పరుగు

తమిళనాట ఆగని విధ్వంసం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 03 , 2024 | 08:33 AM