మహిళ చేతికి డ్రోన్‌లు
ABN , Publish Date - Nov 26 , 2024 | 12:09 AM
రైతులకు డ్వాక్రా మహిళలు అండగా నిలవనున్నారు. వ్యవసాయ పనుల్లో వారికి సాయంగా నిలిచి డ్రోన్ల సాయంతో పురుగు మందులు, ద్రవ ఎరువులు పిచికారి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలను వ్యవసాయ రంగంలో కూడా తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నమో డ్రోన్ దీదీ పథకంలో శిక్షణ
పొలాల్లో పురుగు మందుల పిచికారీకి వినియోగం
మండలానికి మూడు డ్వాక్రా గ్రూప్‌ల ఎంపిక
సబ్సిడీపై డ్రోన్లు అందజేత
చదువుకున్న మహిళలకు ప్రాధాన్యం
నరసాపురం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రైతులకు డ్వాక్రా మహిళలు అండగా నిలవనున్నారు. వ్యవసాయ పనుల్లో వారికి సాయంగా నిలిచి డ్రోన్ల సాయంతో పురుగు మందులు, ద్రవ ఎరువులు పిచికారి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలను వ్యవసాయ రంగంలో కూడా తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా విద్యావంతులైన మహిళలకు సబ్సిడీపై డ్రోన్లు అందించనున్నారు. వీటి నిర్వహణపై శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులు చేయిస్తారు. తొలి విడతగా జిల్లాలో ప్రతి మండలంలోని మూడు డ్వాక్రా గ్రూప్‌లలోని విద్యావంతుల్ని ఎంపిక చేస్తారు. వ్యవసాయ దిగుబడి వ్యయాన్ని తగ్గించడం, కూలీల సమస్యల అఽధికమించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మహిళలకు మారుతున్న టెక్నాలజికి అనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో మహిళలకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. దానికి అనుగుణంగా డీఆర్‌డీఏ విద్యావంతులైన డ్వాక్రా మహిళల్ని ఎంపిక చేసే పనిలో పడింది. త్వరలో వీరిందరికీ వ్యవసాయశాఖ శిక్షణ ఇవ్వనుంది.
డ్వాక్రా మహిళలకు కొత్త జీవనోపాధి
జిల్లా వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు. దాదాపు 4.50లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతున్నది. అయితే ఉత్పత్తి వ్యయం పెరగ డంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎక్కువ ఖర్చు కూలీలు, ఎరువులు, మందులకే సరిపో తుంది. వీటితో పాటు కొన్ని సమయాల్లో పొలా ల్లో మందులు పిచికారి చేసేందుకు కూలీలు కూడా చిక్కడం లేదు. కొన్ని సమయాల్లో రైతులే పిచికారి చేసుకుని అనారోగ్యం బారిన పడు తున్నారు. ఇటీవల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు డ్రోన్లను తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం వీటిని రైతులకు అందించి ఉత్పత్తి వ్య యాన్ని తగ్గించాలని భావిం చింది. దానికి అనుగుణంగా నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకా లకు రాష్ట్ర ప్రభుత్వా లకు అందించింది. కూటమి ప్రభుత్వం బయట వ్యక్తులకు కాకుండా మహిళల్ని వ్యవసాయరంగానికి తీసు కొచ్చి వారికి జీవనోపాధికి అవకాశాలు పెంచాలని భావిం చింది. ఈ బాధ్యతల్ని డ్వాక్రా మహి ళలకు అప్పగిస్తే సమర్ధంవతంగా నిర్వహిస్తారని యోచించింది. జిల్లాలో 80శాతం డ్వాక్రా మహి ళలు వ్యవసాయరంగానికి సంబంధించిన కుటు ంబాలకు చెందిన వారే. వీరికి ఈ బాధ్యతల్ని ఇస్తే సమర్ధవంతగా చేపట్టి మంచి ఫలితాలు తీసుకొస్తారన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక ఎంపిక చేసే బాధ్యతను డీఆర్‌డీఏకు అప్పగించారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రూప్‌లను ఎంపిక చేస్తారు. వీరిలో విద్యావంతుల్ని గుర్తించి వారికి డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ వ్యవసాయశాఖ చేపడుతుంది. సాగు సమయంలో శిక్షణ పొందిన వారంతా వ్యవసా యశాఖ అధికారులతో కలిసి ఆ మండల పరిఽధి లో అవసరమైన రైతుల భూముల్లో డ్రోన్ల సా యంతో పిచికారి పనులు చేపడతారు. ఇందుకు నామమాత్రపు ఛార్జీలు తీసుకుంటారు. రైతులు పిచికారిచేయాల్సి మందుల్ని ఇస్తేసరిపోతుంది.
రూ.8 లక్షల సబ్సిడీ
ఇక మహిళలకు అందించే డ్రోన్ల ఖరీదు రూ.10లక్షలు విలువ చేస్తుంది. వీటిలో మహిళలు కేవలం 20శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 80శాతం ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తుంది. అంటే రూ. 10లక్షల్లో మహిళలు రూ 2లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.8లక్షలు సబ్సిడీనే. దాన్ని తిరిగి చెల్లించనవసరం లేదు. ఇక వీటిని ఎలా ఆపరేట్ చేయాలన్న దానిపై కూడా మహిళలకు 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అవసరమైతే వారి కుటుంబంలో విద్యావంతులైన మరొకర్ని కూడా సహాయకులుగా తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. వీరికి కూడా డ్రోన్లు ఏవిధంగా అమర్చాలి, వచ్చే చిన్న చిన్న సాంకేతి సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ఇక రసాయనాలు, పురుగు మందుల్ని ఏ విధంగా కలిసి డ్రోన్లకు అమర్చాలి, వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఏ విధంగా ఆపరేట్‌పై తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలో 20 మండలాలు ఉండగా స్వయం సహాయక సంఘాలు 28754, డ్వాక్రా సభ్యులు 2,88140 మంది ఉన్నారు.
ఎంపిక చేస్తున్నాం
కుసుమ కుమారి, డీఆర్‌డీఏ డీపీఎం
నమో డ్రోన్ దీదీ పథకానికి సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ప్రతి మండలం నుంచి మూడు డ్వాక్రా గ్రూప్‌ల్ని ఎంపిక చేస్తున్నాం. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈనెలాఖరు నాటికి పూర్తి చేస్తాం. శిక్షణ బాధ్యత, డ్రోన్ల అప్పగి ంత వంటి పనుల్ని వ్యవసాయశాఖ చూసు కుంటుంది