Share News

డంపింగ్‌ టెన్షన్‌

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:37 AM

పట్టణంలోని గోదావరి ఒడ్డున పురపాలక సంఘం నిర్వహిస్తున్న డపింగ్‌యార్డుపై ఢిల్లీ లోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు దాఖలైన పిటీషన్‌ ఇప్పుడు అధికారుల్లో టెన్షన్‌ను రేపుతున్నది. 30ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ డపింగ్‌యార్డు వల్ల నది జలాలతో పాటు పరిసర ప్రాంతా లు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని పట్టణానికి చెందిన ఓసూరి ఫణికర్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు.

డంపింగ్‌ టెన్షన్‌

చెత్త డంపింగ్‌పై పిటీషన్‌

నరసాపురంలో పొల్యూషన్‌ బోర్డు తనిఖీలు

వచ్చే నెల 7న గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు రిపోర్టులు

తీర్పుపై అధికారుల్లో ఆందోళన

భారీ పెనాల్టీ విధించవచ్చని ఊహాగానాలు

యార్డు తరలింపుపై అధికారుల కసరత్తు

నరసాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గోదావరి ఒడ్డున పురపాలక సంఘం నిర్వహిస్తున్న డపింగ్‌యార్డుపై ఢిల్లీ లోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు దాఖలైన పిటీషన్‌ ఇప్పుడు అధికారుల్లో టెన్షన్‌ను రేపుతున్నది. 30ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ డపింగ్‌యార్డు వల్ల నది జలాలతో పాటు పరిసర ప్రాంతా లు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని పట్టణానికి చెందిన ఓసూరి ఫణికర్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. దీన్ని న్యాయ మూర్తులు సీరియస్‌గా పరిగణించి తక్షణం విచారణ నిర్వహించాలని ఆదేశించారు. దాని కి అనుగుణంగా చెన్నై కాలుష్య నియంత్రణ మండలి రీజనల్‌ డైరెక్టర్‌ వరలక్ష్మి ఆధ్వ ర్యంలో రాష్ట్ర పొల్యూషన్‌ బోర్డుకు చెందిన ఈఈ కేవీరావు, రాష్ట్ర కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి శాస్ర్తి, పర్యావరణ శాస్త్ర వేత్తలు సౌమ్య, సుకృతలు రెండు రోజుల పాటు గోదావరి తీరంలో పర్యటించారు. గాలి, మట్టి, నీరుల్లో కాలుష్య పరిశీలనకు 54 శాంపిల్స్‌ తీశారు. వీటి నివేదికలను వచ్చే నెల 7న గ్రీన్‌ట్రిబ్యునల్‌కు అందించనున్నారు. పరీక్షల్లో వచ్చిన రిపోర్టును స్థానిక అధికా రులకు కూడా వెల్లడించలేదు. దీంతో గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వీరు అందించే నివేదికపై ము నిసిపల్‌ అధికారుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ట్రిబ్యునల్‌ న్యాయమూర్తులు కాలు ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రిపోర్టుల ఆధారంగా తీర్పు ఎలా ఉంటుం దోనన్న భయం వెంటాడుతున్నది. అయితే రిపోర్టుల్లో ఏమాత్రం తీవ్రత ఉంటే ఈసారి ట్రిబ్యునల్‌ సీరియస్‌గా పరిగణించి ముని సిపాలిటీకి భారీ పెనాల్టీ విధించవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లేని పక్షంలో తక్షణం నది ఒడ్డున ఉన్న డపింగ్‌ యార్డును ఖాళీ చేయిస్తూ తీర్పును చెప్పవ చ్చన్న వాదనలు లేకపోలేదు. ఈ రకమైన తీర్పు వస్తే డపింగ్‌యార్డును ఎక్కడికి తరలి ంచాలన్న దానిపై మునిసిపల్‌ అధికారులు ఇప్పటి నుంచే తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై జిల్లా అధికారులు కూడా దృష్టి పెట్టా రు. ఉన్నతాధికారులు ఆర్డీవో దాసిరాజుతో ఈ విషయంపై సమీక్షిస్తున్నారు.

డంపింగ్‌ యార్డు తరలింపు ఎక్కడికి?

అధికారులు డపింగ్‌యార్డును తాత్కాలి కంగా ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తు తం డపింగ్‌ యార్డులో సుమారు 50వేల టన్నుల చెత్త ఉంది. దీన్ని రీసెక్లింగ్‌ చేస్తు న్నారు. సుమారు రూ.3.50 కోట్లతో చేపడు తున్న ఈ పని పూర్తికావడానికి ఇంకా ఎని మిది నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఉన్న చెత్తను అక్కడే ఉంచి రోజువారీగా సేక రిస్తున్న చెత్తను మరో ప్రదేశంలో వేయాలని ఆధికారులు భావిస్తు న్నారు. దాన్ని తాత్కాలి కంగా నిర్వహించా లంటే కనీసం రెండు ఎకరాల స్థలమైన ఉండాలి. పట్టణ పరిఽధిలో ఎక్కడ పురపాలక సంఘానికి ఇంత పెద్ద స్థలం లేదు. ఇటు పరిశీలనకు వచ్చిన బృం దం ఆఽధికారులు డపింగ్‌యార్డుపై స్థానిక మునిసిపల్‌ అధికా రులకు కొన్ని సూచనలు చేశారు. చెత్తను తడి, పొడిగా సేకరించాలని, గోదావరి పరీవాహక ప్రాంతానికి 100 మీ టర్ల దూరంలో మాత్రమే చెత్తను వేయాలని ఆదేశించారు. దీంతో ఇంత దూరంలో ఏ స్థలం ఖాళీగా ఉందన్న దానిపై అధికారులు దృష్టి పెట్టారు.

Updated Date - Dec 16 , 2024 | 12:38 AM