Share News

ఆదర్శ గురువులు

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:49 AM

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని ఎంపిక చేసింది.

ఆదర్శ గురువులు

ఎన్నికల కోడ్‌ కారణంగా వీరికి అవార్డుల ప్రదానం వాయిదా

భీమవరం రూరల్‌/నరసాపురం/పెనుగొండ/ ఇరగవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని ఎంపిక చేసింది. ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు న వీరిని ఎంపిక చేసి అవార్డులు అందజేసేది. ఈ ఏడాది విజయవాడ వరదల కారణంగా వాయిదా పడింది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అవార్డులు అందించడానికి నిర్ణయించింది. కాని, ఉమ్మడి ఉభమ గోదా వరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ జిల్లాల్లో ఎంపికైన ఉపాధ్యాయులకు అవా ర్డుల ప్రదానం వాయిదా చేశారు. కోడ్‌ లేని జిల్లాల్లోని టీచర్లకు యధావిధిగా అందజేస్తారు. జిల్లా నుంచి పెనుగొండ మండలం వడలి జడ్పీ హైస్కూల్‌ టీచర్‌ డీఎల్‌ నరసింహమూర్తి, నర సాపురం మునిసిపల్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు వీవీఎస్‌ఎస్‌ నాగలక్ష్మి, ఇరగవరం మండ లం యర్రాయిచెరువు ఎంపీపీ స్కూల్‌ టీచర్‌ పాలా యజ్ఞ పోలారావు ఎంపికయ్యారు.

విద్యార్థుల వల్లే అవార్డు

వీవీఎస్‌ఎస్‌ నాగలక్ష్మి, మున్సిపల్‌ ప్రైమరీ హైస్కూల్‌, నర్సాపురం

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికవడం ఆనందంగా ఉంది. నేను బోధన అందించిన విద్యార్థుల వల్లే ఈ అవార్డు వచ్చింది. నేషనల్‌, ఇంటర్నేషల్‌ 11 సదస్సుల్లో ఇంగ్లీష్‌లో స్పీచ్‌ ఇచ్చా. టీవీ, రేడియోల్లోనూ ఇంగ్లీష్‌ మీద క్లాస్‌లు చెప్పా. నా చిన్ననాటి గురువు మంగళంపల్లి సోమయాజులు నాకు ఆదర్శం. పిల్లలకు మంచి బోధన ఇవ్వాలన్నదే ఆలోచన. ఇంగ్లీష్‌ మీద ఒక్క టెక్స్ట్‌ బుక్‌ రాశాను.

హైస్కూల్‌గా మార్పించా

డీఎల్‌ నరసింహమూర్తి,

జడ్పీ హైస్కూల్‌, వడలి, పెనుగొండ

35 ఏళ్లుగా ఉపాధ్యా య వృత్తిలో ఉన్నా. ఏడా దిన్నరగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నా. కాకిలేరులో ప్రైమరీ స్కూ లు ఉండేది. విద్యార్థుల ఇబ్బందులను చూసి ఈ స్కూల్‌ను హైస్కూల్‌గా మార్పించా. వడలి స్కూల్‌లో టెన్త్‌ విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. అవార్డు రావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు మరిన్ని సేవలందిస్తా.

టై, బెల్ట్‌ ఏర్పాటుచేశా

పీఎల్‌ పాలారావు, ఎంపీపీ స్కూల్‌, యర్రాయిచెరువు, ఇరగవరం

2002లో ఉపాధ్యాయునిగా చేరా. 2014లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందా. విద్యార్థులకు ప్రభుత్వం టై, బెల్ట్‌ ఏర్పాటు చేయలేని సమయంలో ఆ రెండు ఏర్పాటు చేయించా. నేను చేసే పాఠశాలలో మంచి బోధన అందించడంతోపాటు పిల్లలు సంఖ్య పెరిగేలా చూస్తా. విద్యార్థులకు బోధన ద్వారా మంచి ప్రతిభ కనబరిచేలా చేయాలన్నదే నా లక్ష్యం.

Updated Date - Nov 10 , 2024 | 12:49 AM