రూ.13,27,700 నగదు స్వాధీనం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:14 AM
ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తనిఖీల్లో రూ.6.96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఉంగుటూరు /నిడమర్రు /కలిదిండి ఏప్రిల్ 2 : ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తనిఖీల్లో రూ.6.96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిడమర్రు సీఐ మోగంటి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో చేబ్రోలు ఎసై మణి కుమార్ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేస్తుండగా విశాఖ నుంచి నెల్లూరు జిల్లా సంఘంకు వెళుతున్న కారులో మునగాల కోటేశ్వరరావు తీసుకు వెళుతున్న నగ దుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు టోల్‌గేట్ సమీపంలో రూ.లక్షా 27 వేల 700 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిడమర్రు మండలం భువ్వనపల్లిలో ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి షేక్ హబీబ్ భాషా నేతృత్వంలో వాహన తనిఖీలు చేస్తుండగా తాడేపల్లి గూడెం నుంచి కాళ్ళ వెళ్తున్న కారు తనిఖీ చేయగా కామిశెట్టి సత్యదుర్గాదాస్ ఎటు వంటి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో రూ.75 వేలు నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నిడమర్రు ఎస్‌ఐ .శ్రీను, మనోహర్, దుర్గారావు, జ్యోతి పాల్గొన్నారు. కలిదిండి మండలం మద్వానిగూడెం చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా కలిదిండికి చెందిన గంపా రాజేష్ బుల్లెట్‌పై మంగళవారం రాత్రి రూ.3,59,960, కోరుకొల్లుకు చెందిన చావాకుల వెంకట రాజేష్ కారులో రూ.78,500 నగదును తగిన ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ ప్రియకుమార్ తెలిపారు.