Share News

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి లంచం డిమాండ్‌

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:37 AM

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి రెండు గంటల పాటు పరిశీలించారు.

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి లంచం డిమాండ్‌
ఆస్పత్రిలో వివరాలు తెలుసుకుంటున్న తహసీల్దార్‌

ఉద్యోగులు సొమ్ము వసూలు చేస్తుండగా వీడియో తీసిన మహిళ

ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో ఆస్పత్రిలో విచారణ

ఏలూరు క్రైం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి రెండు గంటల పాటు పరిశీలించారు. అవినీతి జరిగితే సహిం చేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఆసుపత్రి మాతా శిశు విభాగం ఉద్యో గుల తీరు మారలేదు. వారికి లంచం ఇవ్వనిదే ఏ పని జరగదని ప్రచారం కూడా ఉంది.

ఒక మహిళ ప్రసవానికి ఆస్పత్రికి వెళితే ఆమె బంధువుల వద్ద నుంచి అడుగడుగునా ఆసుపత్రి ఉద్యోగులు లంచం వసూలు చేశా రని ఆ మహిళ ఆరోపించింది. ఒక వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించడంతో జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏలూరు అర్బన్‌ తహసిల్దార్‌ శేషగిరి శుక్రవారం ఆసుపత్రి చేరుకుని సా యంత్రం 6.30 గంటల వరకూ ప్రాథమిక విచారణ చేశారు. తల్లి బిడ్డల విభాగాన్ని అడు గడుగునా ఆయన పరిశీలించి వివరాలు సేకరించారు. పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఒక మహిళ ఎంసిహెచ్‌ విభాగంలో ప్రసవం కోసం చేరింది. ఆమెకు సాధారణ ప్రసవమైంది. ఆమె బంధువు లావణ్య నుంచి అక్కడ పనిచేసే ఎఫ్‌ఎన్‌వో (జీడీఏ) రూ.500 లంచం తీసుకున్నారని వీడియో తీసి పెట్టారు. అంతేకాకుండా అడుగడుగునా అక్కడ సిబ్బంది లంచాలు అడిగిన విధానాన్ని ఆమె వీడియో ద్వారా తెలియజేశారు. ఈ సంఘటనపై విచారణకు కలెక్టర్‌ తక్షణం ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్‌ శేషగిరి ఆసుపత్రికి చేరు కుని లావణ్య వాగ్మూలం నమోదు చేశారు. ఈ నెల 18న పూర్తిస్థాయి విచారణకు ముగ్గురు వైద్యుల బృందంతో కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరు ఎంత లంచం తీసుకున్నారనేది విచారణ కమిటీ నిగ్గు తేల్చనుంది. ఈ సందర్భంగా ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ శేషగిరి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాను ప్రాథమిక విచారణ జరిపానని ఈనెల 18న పూర్తి స్ధాయి విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నామని చెప్పారు.

Updated Date - Dec 14 , 2024 | 12:37 AM