Share News

బది‘లీలలు’

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:03 AM

రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధం తొలగించి ఈ నెల 16వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంతకుముందు ఆదేశించింది. ఈ లోపే వరదలు రావడం తో అనేక జిల్లాలు వీటి బారిన పడడం తో సహాయక చర్యల్లో కొందరు నిమగ్నమ య్యారు.

బది‘లీలలు’

ప్రక్రియ 22 వరకు పొడిగింపు

ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు

ఎక్సైజ్‌లో పోటీ తీవ్రం

ఏలూరు/భీమవరం టౌన్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధం తొలగించి ఈ నెల 16వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంతకుముందు ఆదేశించింది. ఈ లోపే వరదలు రావడం తో అనేక జిల్లాలు వీటి బారిన పడడం తో సహాయక చర్యల్లో కొందరు నిమగ్నమ య్యారు. ఈ తరు ణంలో బదిలీల ప్రక్రియను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లోనే పోస్టింగ్‌ ఆర్డర్లకు అవకాశం ఉన్న తరు ణంలోనే ఇప్పుడున్న ప్రక్రియను ఈ నెల 22 వరకు ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఇప్పటికే తమకు కావాల్సిన ప్రాంతంలో పోస్టింగ్‌ కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ గిరగిరా తిరిగారు. మరోసారి గడువు పొడిగిం పుతో తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టబోతున్నారు. ఎక్సైజ్‌ శాఖకు మాత్రం ఈ నెలాఖరు వరకు బదిలీలకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బదిలీల నిషేధం అమలులోకి వస్తుంది. కొన్ని శాఖలకు మినహా మిగతా శాఖలకు బదిలీలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని కచ్చితంగా బదిలీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. వాటిలో కొన్ని పరిపాలన సౌలభ్యం కోసం బదిలీ చేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే మునిసిపాల్టీకి సంబంధించి బదిలీల ప్రక్రియ జరిగింది. కమిషనర్లకు బదిలీలు చేసి పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ప్రస్తుతం బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తాము కోరుకున్న చోటుకు స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని బదిలీ అవుతుందనే ధీమాతో ఉన్నా రు. మరి కొందరు తమకు ఎక్కడ ఇచ్చినా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు అధికారులు, ఉద్యోగులు మాత్రం ఉన్నచోట ఉండే విధంగా స్థానిక ప్రజా ప్రతినిఽధులను ప్రసన్నం చేసుకుని తమకు బదిలీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 22 వరకు అవకాశం ఉన్నందున తమకు బదిలీలు అదే రోజు రాత్రి ఉత్తర్వులు వస్తాయనే ధీమాతో ఉన్నారు. జిల్లా నుంచి సుమారు రెండు వేల వరకు ఉద్యోగులు బదిలీ అవుతారని సమాచారం. ఈ నెల 23 నుంచి బదిలీలపై తిరిగి బ్యాన్‌ కొనసాగుతుంది.

మాకంటే.. మాకే

బదిలీ ప్రక్రియల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉండడంతో ఆ శాఖకు సంబంధించిన కొందరు ఉన్నత స్థాయిలోనే కోరుకున్న స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏలూరు, భీమవరం, తణుకు, నూజివీడు ఈ తరహా వాటన్నింటి లోనూ రిజిస్ట్రేషన్ల సంఖ్య ఇంతకు ముందు కంటే ఈ మధ్యన పెరిగింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలై ఆ స్థానంలో కూటమి ప్రభుత్వం రావడంతో ఎక్కడికక్కడ లావాదేవీలు పెరిగి దాని ప్రభావం కాస్తా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ శాఖలోనే బదిలీలు కోరుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.

మనోడేనా..

బదిలీల ప్రక్రియ ముందుకు పొడిగించ డంతో ఇప్పటికే కొందరి విషయంలో ఇచ్చిన సిఫార్సులపైన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ విభా గాల్లో పనిచేస్తున్న కొందరిని తమ నియోజక వర్గంలోకి బదిలీ చేయించుకునే దిశగా మరి కొందరు ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఇచ్చిన సిఫార్సు లేఖలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సామాజిక వర్గాల వారీగా, గడిచిన ఐదేళ్లల్లో ప్రభుత్వపరంగా ఏ పనులు లేక ఒకేచోట ఉండిపోయి విసుగెత్తిన ఇంకొందరు తమకు ఫలానా ప్రాంతం కావాలని పట్టుబట్టి మరీ అమరావతి నుంచి ఫోన్‌లు చేయించడం, తదనుగుణంగానే మార్పులు, చేర్పులకు వీలుగానే సిఫార్సు లేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ సిబ్బంది విషయంలోను ఇప్పుడు ఇదే జరుగుతోంది. నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసేందుకే అత్యధికులు సుముఖంగా ఉండడంతో స్థానిక నేతలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

ఎక్సైజ్‌కు పూర్వ వైభవం

గత ప్రభుత్వం సెబ్‌ ఏర్పాటు తర్వాత ఎక్సైజ్‌లో చాలా మంది డీలా పడ్డారు. ఇప్పుడు తాజాగా సెబ్‌ను రద్దు చేయడంతో ఆ స్థానంలో తిరిగి ఎక్సైజ్‌ శాఖకు పూర్వ వైభవం తేనున్నారు. 2019 వరకు ఉన్న వ్యవస్థ మళ్లీ యఽథావిధిగా కొనసాగడం, ఎక్సైజ్‌ ఉద్యోగుల బదిలీలు ఈ నెల 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరడంతో ఆ మేరకు ఎక్సైజ్‌లో సరికొత్త ఎక్సర్‌సైజ్‌లు ప్రారంభమయ్యాయి. పాత మద్యం విధానమే తిరిగి రానున్నదనే ప్రచారం జరుగు తుండగా ఆ దిశగా తమకు సహకరించే ఎక్సైజ్‌ అధికారుల కోసం ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అన్వేషించి లిస్టు కూడా సమకూర్చుకు న్నారు. ఇప్పుడు ఈ తరహా పరిస్థితినే మదింపు చేసుకుని ఎక్సైజ్‌లో సీనియర్లు తాము కోరుకున్న స్థానం కోసం పట్టుపడు తున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 12:03 AM