వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఎత్తివేయండి
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:33 AM
కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునః ప్రారంభించాలంటూ ఉద్యమించిన ఉపాధ్యాయు లు, ఉద్యోగులపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారు.
ఏలూరు అర్బన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునః ప్రారంభించాలంటూ ఉద్యమించిన ఉపాధ్యాయు లు, ఉద్యోగులపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారు. ఎస్పీ శివప్రతాప్ కిశోర్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మంగళవారం కలుసుకుని అభ్యర్థించారు. వివరాలను పీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపా రు. ఉమ్మడి జిల్లాలో టీచర్లు, ఎన్జీవోల నేతలపై నమోదైన కేసుల వివరాలను అందజేసి, వాటికి సంబందించిన ప్రాసిక్యూషన్ ఉపసంహరణను ఫైల్‌చేసి, కోర్టుకు సమర్పించాలని ఎస్పీని కోరా మన్నారు. తమ అభ్యర్థనపై స్పందించిన ఎస్పీ కోర్టు కేసుల పూర్వాపరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపా రు. ఎస్పీని కలిసినవారిలో ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ ఎస్.హరనాథ్, జేఏసీ జిల్లా చైర్మన్ సీహెచ్.శ్రీని వాస్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముస్తఫాఅలీ, ఏపీటీఎఫ్–1938 జిల్లా కార్యదర్శి కృష్ణ, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, సీపీఎస్ నాయకుడు కె.నాగేశ్వరరావు తదితరులున్నారు.