నకిలీ బంగారం ముఠా అరెస్టు
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:32 AM
ఓ చేపల చెరువు రైతు వద్దకు పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఆ రెతు స్థితిగతులను తెలుసు కున్నాడు. ఆ రైతు అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నాడు.
రూ. 16 లక్షల నగదు స్వాధీనం
ఏలూరు క్రైం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఓ చేపల చెరువు రైతు వద్దకు పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఆ రెతు స్థితిగతులను తెలుసు కున్నాడు. ఆ రైతు అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నాడు. అక్కడ పనిమానేసి వెళ్ళిపోయిన తరువాత ఆ రైతును మోసగించాలని పథకం పన్నాడు. తనతోపాటు మరికొందరిని కలుపుకుని ముఠాగా ఏర్పడి తక్కువ ధరకు బంగారం ఇస్తా నని ఆశ చూపించి ఆపై అడ్వాన్సుగా సొమ్ములు తీసుకుని మిగిలిన సొమ్ములు తీసుకు వస్తే బంగారం ఇస్తానని చెప్పి మిగిలిన సొమ్ములు తేగానే దాడికి పాల్పడ్డారు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి 16 లక్షల రూపాయల నగదును, నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసు వివరాలను జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ శనివారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరా లను వెల్లడించారు. కృష్ణాజిల్లా పెడన మండలం చిన్నూరు గ్రామానికి చెందిన పండ్రాజు రవీంద్ర కుమార్ నాలుగేళ్ల నుంచి ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో ఉంటూ చేపలు, రొయ్యలు చెరు వులు సాగుచేస్తున్నాడు. అతని వద్ద గతంలో చేపల చెరువుపై పనిచేసిన నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మల్లాలు పేటకు చెందిన డబ్బా ఈశ్వర్ (23) ఈ ఏడాది అక్టోబర్ నెలలో తరచుగా రవీంద్రకుమార్‌కు ఫోన్‌చేసి తమ వద్ద బంగారం ఉందని తక్కువ ధరకు ఇచ్చేస్తామం టూ నమ్మబలికాడు. అక్టోబర్ 23న బంగారం తనిఖీ చేసుకోవడానికి రావాలని చెప్పడంతో రవీంద్రకుమార్ సింగరాయపాలెం సెంటర్‌కు వెళ్ళాడు. అక్కడ ఈశ్వర్‌తోపాటు మరికొందరు ఉన్నారు. వారి నడుముకు బంగారు పూసల గొలుసు ఉంది. ఆ గొలుసులోని చివరి మూడు పూసలు కట్ చేసి వాటిని పరీక్షించుకోవాలని సూచిం చడంతో అవి అసలైన బంగారమే నని తేలడంతో ఐదు లక్షల అడ్వాన్సు ఇచ్చారు. మిగి లిన 15 లక్షలు మరుసటిరోజే విజయవాడ రమ్మని ఆపై గుంటూరు రమ్మని చెప్పి 15 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిన రవీంద్రకుమార్‌ను ఈశ్వర్, అతని ముఠా సభ్యులు కలిసి దాడిచేసి చంపివేస్తానని బెదిరించి 15 లక్షలతో పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధితుడు ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం చిత్తూరు జిల్లా లో నందివాడ మండలం పొలికొండులో దబ్బా ఈశ్వర్, నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మల్లాలపేటకు చెందిన బాణావతు చిన్నా (25) చిత్తూరు జిల్లా వేంపాడులోని ఈశ్వర్ కాలనీకి చెందిన భూక్యా సాంబ్రా అలియాస్ శ్యామ్‌లను అరెస్టు చేశారు. ఆ కేసులో మరో నలుగురు నిం దితులను అరెస్టు చేయాల్సి ఉంది. నకిలీ బంగా రం ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసిన ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, కైక లూరు రూరల్ సీఐ బి.రవికుమార్, ముదినేపల్లి ఎస్‌ఐ వీఎస్‌వీ భద్రరావు, మండవల్లి ఎస్‌ఐ సూర్యరామచంద్రరావు, కలిదిండి ఎస్‌ఐ పి.వెంక టేశ్వరరావు, కానిస్టేబుళ్ళు వి.నాగబాబు, ఎండి షఫీ, పి.పవన్‌కుమార్, కె.నాగార్జున, ఎస్.రాంబా బు, బి.వెంకటేశ్వరరావు, నాగాంజనేయులు, ఐటీ కోర్ విభాగానికి చెందిన సత్యనారాయణలకు ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్, అదనపు ఎస్పీ ఎన్ సూర్య చంద్రరావు అందించారు.