కళాశాలల ఖాతాలకే.. ఫీజులు జమ
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:08 AM
ఉన్నత విద్యా సంస్థలకు ఊరట లభించింది. విద్యా ర్థులకు కష్టాలు తొలగాయి. ప్రభుత్వం ఫీజు రీయింబ ర్స్‌మెంట్ సొమ్మును కళాశాలల ఖాతాలకే జమ చేయ నుంది. ఆ దిశగా ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్లపాటు తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేశారు.
కూటమి ప్రభుత్వ నిర్ణయం
తొలగిన విద్యార్థుల కష్టాలు..
యాజమాన్యాలకు ఊరట..
బకాయిల విడుదలకు ఎదురుచూపు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఉన్నత విద్యా సంస్థలకు ఊరట లభించింది. విద్యా ర్థులకు కష్టాలు తొలగాయి. ప్రభుత్వం ఫీజు రీయింబ ర్స్‌మెంట్ సొమ్మును కళాశాలల ఖాతాలకే జమ చేయ నుంది. ఆ దిశగా ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్లపాటు తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేశారు. దానిని తీసుకుని కళాశాలలకు చెల్లించాల్సి వచ్చేది. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యా లు ఇబ్బందులు పడేవి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే సర్టిఫికేట్‌లు ఇచ్చేందుకు కళాశాలలు మొరాయించేవి. విద్యార్థులు ఆందోళనకు గురయ్యేవారు. తల్లుల ఖాతాలో ఫీజులు వేయడం వల్ల విద్యార్థులకు ఒరిగిందేమీ లేదు. వైద్య కళాశాలలు అయితే ముందు గానే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటు న్నాయి. ఇది తల్లిదండ్రులకు భారంగా మారింది. తెలు గుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. విద్యార్థులకు ఇబ్బందులు లేని విధానాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కళాశాలల ఖాతాలో జమ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు లోకి తీసుకురానుంది. ప్రతి ఏటా జిల్లాలో రూ.100 కోట్లు మేర ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఫీజులు పెరిగాయి. కొన్ని ఇంజ నీరింగ్ కళాశాలలకు ఫీజులు అధికమయ్యాయి. దీంతో అదనంగా ప్రభుత్వం పై మరో రూ.20 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా ఈ ఏడాది నుంచి రూ.120 కోట్ల మేర కళాశాలల ఖాతాల్లో జమ చేయాలి. జిల్లాలో 36 వేల మంది విద్యార్థులకు తెలుగుదేశం కూటమి ప్రభు త్వ నిర్ణయం వల్ల ఉపశమనం లభించింది. విద్యార్థుల కు ఇక ఫీజులతో ప్రమేయం ఉండదు. తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్యే ఫీజుల బాధ్యత ఆధారపడనుంది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వారి ఖాతాలోనే..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఫీజు చెల్లిస్తోంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. కేంద్రంతో ముడిపడి ఉండడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వారి ఖాతాల్లోనే ఫీజు జమ చేయనున్న ట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో వారి ఫీజును ప్రభుత్వమే కళాశాలలకు చెల్లించేది.ఇప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కాస్త ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.
పీజీ కోర్సులకు పరిశీలన
పీజీ కోర్సులకు వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీజీ కోర్సుల విద్యార్థుల్లో ఆశలు చిగురించా యి. ప్రభుత్వం ఆ దిశగా పరిశీలిస్తోంది. ఫీజు రీయిం బర్స్‌మెంట్ లేకపోవడంతో పీజీ కోర్సుల్లో చేరేం దుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎంసీఎ, ఎం బీఏ, ఎంటెక్ కోర్సుల్లో విద్యార్థులు చేరే సంఖ్య పడిపో యింది. పరిశోధనలు చేసేందుకు విద్యార్థులకు అవకా శం లేకుండా పోతోంది. ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకున్నప్పుడే పేద విద్యార్థులు పరిశోధనా రంగంలోనూ రాణించనున్నారు. పీజీ కోర్సులను పూర్తి చేసి న తర్వాతే అది సాధ్యపడుతుంది. అందుకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల నిర్వహణకు యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల ముందు కూటమి అధిష్ఠానం దృష్టికి విద్యార్థులు తమ సమస్యను తీసుకువెళ్లారు. ఇప్పుడు పీజీ కోర్సులకు ఫీజు రీయింబ ర్స్‌మెంట్ పరిశీలనలో ఉంది.
బకాయిల కోసం ఎదురుచూపులు
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఏడాది ముందు నుంచి ఫీజులు చెల్లించలేదు. అంతకుముం దున్న పీజీ బకాయిలను జమ చేయలేదు. మొత్తంగా కళాశాలలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. యాజ మాన్యాలు వాటి కోసం ఎదురుచూస్తున్నాయి. వేతనాలు చెల్లించడానికి ఆపసోపాలు పడుతు న్నాయి. కొన్ని కళాశాలలకు ఫీజుల నిర్ధారణ లోనూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. దానిపై దిద్దుబాట చర్యలు తీసు కుంటారని యాజమాన్యాలు ఎదురుచూస్తు న్నాయి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఆ మేరకు సంకేతాలు రాలేదు. గతంలో నిర్ధా రించిన ఫీజులను మాత్రమే పెంచింది. అప్ప ట్లో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు బలైన కళాశాలలకు ఇప్పటికీ ఊరట లభించలేదు. మరోవైపు ప్రభుత్వం బకాయిలు చెల్లించే రోజు కోసం కళాశాలలు ఎదురు చూస్తున్నాయి.