Share News

అమరుల స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలి

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:21 AM

అమరుల స్ఫూర్తితో సమస్యలపై ఐక్యతతో పోరాడాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పి.శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నాగన్నగూడెంలో నాగన్న, గంగిరెడ్డిలో గల స్థూపం వద్ద కొండరెడ్లతో కలిసి నివాళులర్పిం చారు.

అమరుల స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలి
అమరవీరుల వారోత్సవాల్లో

బుట్టాయగూడెం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అమరుల స్ఫూర్తితో సమస్యలపై ఐక్యతతో పోరాడాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పి.శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నాగన్నగూడెంలో నాగన్న, గంగిరెడ్డిలో గల స్థూపం వద్ద కొండరెడ్లతో కలిసి నివాళులర్పిం చారు. అనంతరం పీవోడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.లత అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్‌ మాట్లాడారు. అమరులు తమ జీవితా లను సమాజ మార్పుకోసం, నూతన సమాజం కోసం త్యాగం చేశారని, వారి కలలను నిజం చేస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు బలమైన ఉద్యమాలు నిర్వహిం చాలన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కళ్యా ణ్‌ అడవులను విస్తరిస్తామని చెప్పారని, అందులో ఆదివాసీల భూములను కలుపుకుని వారి భూముల నుంచి గెంటివేసే కుట్ర దాగి ఉందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదివాసీలు లక్షల ఎకరాల పోడుకొట్టి పోడునే జీవనాధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తూనే ఉన్నారని పట్టాలు ఇవ్వని ప్రభుత్వం అడవుల విస్తరణ పేరుతో గెంటివేసే కుట్రకు తెరలేపిందన్నారు. దానిని ఐక్యంగా ఆదివాసీలు ఏకమై తిపికొట్టాలన్నారు. అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి పాలక వర్గాలు పరుగులు తీస్తున్నాయని, పోరాటాలు ద్వారానే వాటిని అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. చిన్నారెడ్డి, బాబు ల్‌రెడ్డి, పండురెడ్డి, శ్రీరామ్మూర్తిరెడ్డి, కొండరెడ్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:21 AM