కొబ్బరి చెట్టుకు నిప్పు
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:43 AM
ఒక్క సారిగా కొబ్బరి చెట్టుకు మంటలు వ్యాపి ంచాయి. దీంతో స్థానికులు పరుగులు తీశా రు.
పరుగులు తీసిన ప్రజలు
పెనుమంట్ర, డిసెంబర 23 (ఆంధ్రజ్యోతి) : మార్టేరులో ఆదివారం రాత్రి అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్క సారిగా కొబ్బరి చెట్టుకు మంటలు వ్యాపి ంచాయి. దీంతో స్థానికులు పరుగులు తీశా రు. నిప్పంటుకున్న కొబ్బరి చెట్టుకు సమీ పంలోనే హెచ్.పీ గ్యాస్ గొడౌన్ ఉన్నది. కొబ్బరి చెట్టు కింద ఉన్న తాటాకు ఇంట్లో గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే కొందరు పది గ్యాస్ సిలిండర్లు ఉంచారు. ప్రమాదం జర గడంతో స్థానికులు పరుగులు తీశారు ఆ క్రమంలోనే ఆ తాటాకు ఇంట్లో గ్యాస్ బండలను స్థానికుల సహకారంతో తరలిం చారు. చుట్టుపక్కలకు మంటలు వ్యాపించ కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని జనావాసాల్లో ఉన్న గ్యాస్ ఏజెన్సీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.