Share News

వేట ఆగింది

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:43 AM

సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న మత్స్యకారుల జీవనం దినదిన గండమే. సముద్రంపై వేటకు వెళితే మత్స్య సంపద ఎంత చిక్కుతుందో తెలి యని దుస్థితి.

వేట ఆగింది

వాయుగుండం, వర్షాలతో మత్స్యకారులకు తప్పని తిప్పలు

15 గ్రామాల్లో వేట ఆధారం

మత్స్యకారులకు ప్రకృతి ప్రతికూలం

వరుస తుఫాన్లతో వేటకు అడ్డంకి

ఉపాధి లేక మత్స్యకారుల పస్తులు

ఇంకా అందని నిషేధ భృతి

సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న మత్స్యకారుల జీవనం దినదిన గండమే. సముద్రంపై వేటకు వెళితే మత్స్య సంపద ఎంత చిక్కుతుందో తెలి యని దుస్థితి. ఏరోజు ఆదాయం ఆరోజుకే సరిపో యే పరిస్థితి. అలలకు ఎదురేగి జీవన సమరం సాగిస్తున్న మత్స్యకారులపై ప్రకృతి కన్నెర్రజేసిం ది. ఏప్రిల్‌, మేలో సముద్రంలో వేట నిషేధం. తర్వాత వర్షాలు, తుఫాన్‌లతో నేటికీ వేట సాగని పరిస్థితిలో పూట గడవక ఇబ్బందులు పడుతు న్నారు. ప్రతి నెల తుఫాన్‌, వాయుగుండాలు, అల్పపీడనాల నడుమ సముద్రంపై వేటకు వెళ్లినా నిరాశే ఎదురైంది. కుటుంబ పోషణకు కోసం ఇతర పనుల కోసం వెతుకుతున్నారు.

నరసాపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సముద్ర తీర ప్రాంతం నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని 15 గ్రామాల్లో సుమారు 5వేల మంది సముద్ర వేటతో జీవనం సాగిస్తున్నారు. కొందరు బోట్లపై వేట సాగిస్తే మరికొందరు ఐలు వలలు, సంప్రదాయ బోట్లపై వెళ్లి వేట చేస్తుంటారు. సముద్రంలో పరిస్థితులు అనుకూలి స్తే మత్స్య సంపద పుష్కలంగా దొరుకుతుంది. గాలి, నీటిలో మార్పు, తుఫాన్లు వంటి ప్రతికూల పరిస్థితులు ఉంటే ఇంటిముఖం పట్టాల్సిందే. ఈ ఏడాది జూన్‌ నుంచి వేట ఆరంభంలో సీజన్‌పై ఎంతో ఆశలు పెట్టుకు న్నారు. వరుస తుఫాన్లు మత్స్యకారుల్ని వెంటాడుతూ వచ్చాయి. ఇప్పటివరకు ఏడు తుఫాన్లు చూశారు. మూడు రోజుల క్రితం వరకు తుఫాన్‌ కారణంగా వేటపై నిషేధం ఉంది. ఎప్పుడు తీరం దాటుతుందోనని ఎదురుచూశారు. ఈలోపు బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ఏర్పడడంతో మళ్లీ వేటపై ఆంక్షలు విధించారు. దీంతో ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిషేధ కాలం నాటి భృతి లేదు

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకా రులకు భృతి అందిస్తుంది. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి ప్రతి ఏటా రూ.20వేల చొప్పున ఒకొక్క మత్స్యకారుడికి కుటుంబ పోషణ నిమిత్తం ఈమొత్తాన్ని అందించారు. ఈఏడాది ఇంతవరకు భృతి అందలేదు. సాధారణంగా మే, జూన్‌లో ఈ మొత్తాన్ని మత్స్యకారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఎన్నికల కారణంగా పెండింగ్‌ పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇంకా భృతి మాత్రం అందలేదు. దీని కోసం మత్స్యశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో మత్స్యకారులు ఆశగా ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

త్వరలో అందిస్తాం : ప్రసాద్‌, జేడీ మత్స్యశాఖ

రెండు మండలాల్లో ఆర్హులైన మత్స్యకారులు 1738 మంది ఉన్నారు. వారికి ఈ ఏడాది వేట నిషేధ సమ యంలో అందాల్సిన భృతి జమ కాలేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా విడుదల కాలేదు. నవంబర్‌ 14న ప్రపంచ మత్స్యకార దినోత్సవం, బహుశ ఆ రోజున పెండింగ్‌ భృతి చెల్లించే అవకాశం ఉంది.

వరుస తుఫాన్‌తో కష్టం

సాధారణంగా వర్షాకా లంలో మూడు లేదా నాలుగు తుఫాన్లు వస్తుంటాయి. ఈసారి ప్రతి నెల రెండు మూడు తుఫాన్లు వచ్చాయి. ఐదు నెలల కాలం లో ఏడు తుఫాన్లు సంభవించా యి. ఒక్కసారి తుఫాన్‌ వస్తే పది రోజులు వేట ఉండదు. వేటపై బతుకుతున్నందున్న మరో పని చేయలేక ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా సాయం అందలేదు. ఇప్పటి వరకు నిషేధ భృతి ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెండింగ్‌ భృతి ఇస్తే చాలామందికి ఆకలి తీరుతుంది.

మైలా వసంతరావు, చినలంక

Updated Date - Oct 23 , 2024 | 12:43 AM