Share News

బంగారం వ్యాపారి పట్టివేత

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:37 AM

అప్పుల భయంతో తోటి వ్యాపారుల వద్ద బంగారం, వెండి, నగదు సేకరించి ఊరు నుంచి వెళ్లిపోయాడని డీ ఎస్పీ డి.విశ్వనాథ్‌ తెలిపారు

బంగారం వ్యాపారి పట్టివేత

6.786 కేజీల బంగారం, 106 కేజీల వెండి, కారు, రూ.3లక్షల నగదు స్వాధీనం

తోటి వ్యాపారులకు కుచ్చుటోపీ ...ఆపై పరార్‌

తాడేపల్లిగూడెం రూరల్‌ డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అప్పుల భయంతో తోటి వ్యాపారుల వద్ద బంగారం, వెండి, నగదు సేకరించి ఊరు నుంచి వెళ్లిపోయాడని డీ ఎస్పీ డి.విశ్వనాథ్‌ తెలిపారు. తాడేపల్లి గూడెం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం బంగారు వ్యాపారుల వద్ద బంగారం పట్టుకుపోయిన మాన్వీ జ్యూయలర్స్‌ యజమాని లెంకా రమణ బాబు అరెస్టు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మహా లక్ష్మినగర్‌కు చెందిన మాన్వీ జ్యూయలర్స్‌ యజమాని బులియన్‌ వ్యాపారిగా చేసిన అను భవం ఉంది. అయితే తన తండ్రి దశాబ్ధాలుగా బంగారం వ్యాపారుల వద్ద నమ్మకంగా బులి యన్‌ వ్యాపారిగా నమ్మకం పెంచుకున్నాడు. ఆ తండ్రిపై ఉన్న నమ్మకంతో రమణబాబును నమ్మి తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, భీమవ రం తదితర ప్రాంతాలకు చెందిన బంగారు వ్యాపారులు రమణబాబుకు భారీగా బంగారం, వెండి ఇచ్చారు. అప్పటికే అప్పుల భయంతో ఉన్న రమణబాబు ఒకేసారి భారీగా బంగారం, వెండి సేకరించి ఆ సొత్తుతో ఊరు నుంచి వెళ్లిపోయాడు. రమణబాబుకు బంగారం ఇచ్చిన వ్యాపారులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే పరారయ్యాడని నిర్థారించుకున్నా రు. ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడ ంతో ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్ర యించారు. ఇప్పటికి 33 మంది బాధి తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ విశ్వనాథ్‌ పర్యవేక్షణలో సీఐ సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో పోలీసు లు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు హైదరా బాద్‌, కొవ్వూరు, విశాఖపట్నం ప్రాంతా ల్లో తిరుగుతూ అతని వద్ద ఉన్న బంగారం, వెండి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం రావడంతో రమణబాబును అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.3లక్షల నగదు, 6.786 కేజీల బంగారం, 106.772 కేజీల వెండి, కారు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

Updated Date - Dec 24 , 2024 | 12:37 AM