Share News

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రోగుల పాట్లు

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:44 PM

భీమవరం పట్టణంలోని ప్రాంతీయ ఏరియా ఆసు పత్రిలో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఆసుపత్రికి వస్తే ఇక్కడి అరకొర వసతులతో సతమతమవుతున్నా రు.

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రోగుల పాట్లు
రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద పేర్ల నమోదుకు..

బయట ల్యాబ్‌ల్లో.. కొన్ని రక్త పరీక్షలు

స్కానింగ్‌ యంత్రం ఉన్నా వైద్యుడు లేరు

భీమవరం క్రైం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): భీమవరం పట్టణంలోని ప్రాంతీయ ఏరియా ఆసు పత్రిలో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఆసుపత్రికి వస్తే ఇక్కడి అరకొర వసతులతో సతమతమవుతున్నా రు. భీమవరం పట్టణం, రూరల్‌, ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, వీరవాసరం, మొగల్తూరు, కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలాల ప్రజలు రోజుకు 300 నుంచి 400 మంది వైద్యం కోసం ఆసుపత్రికి వస్తూంటారు. గర్భిణులు అధికంగానే ఉంటారు. నెలకు సుమారు 100 నుంచి 120 వరకు డెలివరీ లు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, కుక్క, పా ము కాట్ల బాధితులు వచ్చేది అధికమే. ఇలాంటి ప్రాంతీయ ఏరియా ఆసుపత్రిలో రక్త పరీక్షల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్క థైరాయిడ్‌ పరీక్ష తప్ప అన్ని రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉన్నా కొందరు సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. కొన్ని పరీక్షలు బయట ల్యాబ్‌లకు పంపిస్తే వారిచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రోగులు ఆ పరీక్షల కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లి వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే పేదరికంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచి తంగా వైద్యం అందిస్తారని, ఇక్కడకు వస్తే వారు బయటకు రక్త పరీక్షలకు పంపించడంలో కొంద రు రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రకాల మందులు బయట మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

స్కానింగ్‌ యంత్రం ఉన్నా డాక్టరు లేరు

భీమవరం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రిలో అధునాతన స్కానింగ్‌ యంత్రం ఉన్నా సంబంధిత వైద్యులు లేకపోవడంతో బయట స్కానింగ్‌ సెంటర్లకు వెళ్ళి డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. గతంలో ప్రైవేటు వైద్యుడిని రప్పించి ఒక్కో స్కానింగ్‌కు రూ.200 ఇచ్చి స్కానింగ్‌ తీసేవారు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యుడు రాకపోవడంతో బయట స్కానింగ్‌ సెంటర్లకు పంపిస్తున్నారు. చిన్న చిన్న స్కానింగ్‌లు మాత్రం ఆసుపత్రి వైద్యులు తీస్తున్నారు.

రిపోర్టులు మరుసటి రోజు

రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు తీసిన తరువాత రిపోర్టుల కోసం మర్నాడు రమ్మనడం విశేషం. కొన్ని రకాల రక్త పరీక్షలు ఒక్క రోజులో పూర్తి కావని రోగులకు చెప్పడంతో వారు నిరుత్సాహ పడుతు న్నారు. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి, పను లు మానుకుని వస్తే మర్నాడు రమ్మనడంతో ఆవే దన చెందుతున్నారు. అత్యవసర కేసులకు మినహాయింపు ఇస్తున్నారు. రిపోర్టుల కోసం ఇబ్బందు లు తప్పడం లేదని రోగులు వాపోతున్నారు.

కొన్ని రకాల స్కానింగ్‌లు తీస్తున్నాం

స్కానింగ్‌ యంత్రం ఉన్నప్పటికీ సంబంధిత వైద్యుడు లేకపోవడంతో స్కానింగ్‌ కోసం బయటకు పంపిస్తున్నాం. చిన్న చిన్న స్కానింగ్‌లు ఇక్కడ ఉన్న వైద్యులు తీస్తున్నారు. రక్తపరీక్షలు అన్ని రకాలు చేస్తున్నాం. ధైరాయిడ్‌ రక్త పరీక్ష మాత్రం ఇక్కడ అందుబాటులో లేదు. రక్త పరీక్షలకు నలుగురు సిబ్బంది, ఒక వైద్యుని పర్యవేక్షణలో నిర్వహిస్తు న్నాం. రిపోర్టులు మాత్రం కొంత సమయం పడుతుంది.

– మాధవి కళ్యాణి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Nov 28 , 2024 | 11:44 PM