Share News

గ్రామ సభలతో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:50 AM

గ్రామ సభల ద్వారా గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు.

గ్రామ సభలతో సమస్యల పరిష్కారం
వెంకట్రామన్నగూడెంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి, ఆర్డీవో భవానీశంకరి

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు, 22 (ఆంథ్రజ్యోతి): గ్రామ సభల ద్వారా గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. వెంకట్రామన్నగూడెంలో మంగళవారం రెవెన్యూ గ్రామసభలో ఆయన మాట్లాడుతూ నిర్వీర్యమైన గ్రామాల్లో జవసత్వా లు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండు గలు తెచ్చి సర్పంచ్‌లకు ఊతమిచ్చింద న్నారు. అనంతరం ఆర్డీవో భవాని శంకరి గ్రామంలో భూముల రీసర్వేపై సమస్యలను స్వీకరించారు. తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, సర్పంచ్‌ పి.అంజూష పాల్గొన్నారు.

తణుకు/అత్తిలి/ఇరగవరం : రైతుల భూ సంబంధ సమస్యలు పరిష్కారమే గ్రామ రెవెన్యూ సభల లక్ష్యమని తహసీల్దార్‌ అశోక్‌ వర్మ అన్నారు. మంగళవారం తేతలి పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ గ్రామసభ నిర్వహిం చారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో అత్తిలి తహసీల్దారర దశిక వంశీ ఆధ్వర్యంలో, ఇరగవరం మండలం ఏలేటిపాడు, అయితంపూడి గ్రామాల్లో తహసిల్దార్‌ ఎం సుందరరాజు ఆధ్వర్యంలో 27 ఫిర్యాదులు స్వీకరించారు.

పాలకోడేరు : పెన్నాడ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ అనూష ఆధ్వర్యంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. వచ్చేనెల రెండో తేదీవరకు రీసర్వే లో లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉందన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనా రాయణరాజు, సర్వేయర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌ : సరిపల్లి గ్రామంలో తహసీల్దార్‌ రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో రీ సర్వేపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌ ఈదా సురేష్‌, ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆచంట : కరుగోరుమిల్లిలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో భూ సంబంధిత సమస్యలపై 30 వినతులు వచ్చాయమని తహసీల్దార్‌ ఎం. సోమేశ్వరరావు తెలిపారు. సర్పంచ్‌ అల్లం పద్మావతి, రీ సర్వే డీటీ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ లక్ష్మి రైతులు పాల్గొన్నారు.

యలమంచిలి :రీసర్వేలో రైతులు ఎవరికైనా విస్తీర్ణంలో వ్యత్యాసం ఉంటే ఈనెల 30వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దారు జి.పవన్‌కుమార్‌ రైతులకు సూచించారు. మంగళ వారం నిర్వహించిన గ్రామసభలో భూ సమస్యలపై 17 దరఖాస్తులు వచ్చాయన్నారు. సర్పంచ్‌ జి.శాంతకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:50 AM