Share News

చేనేతకు పూర్వవైభవం

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:29 AM

చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే చేనేత సహకార సంఘాల బలోపేతంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కార్యవర్గాలను నియమించేందుకు సన్నద్దమవుతోంది.

చేనేతకు పూర్వవైభవం

త్వరలో చేనేత సంఘాలకు ఎన్నికలు

వైసీపీ పాలనలో సంఘాలు నిర్వీర్యం

కూటమి ప్రభుత్వం బలోపేతానికి చర్యలు

ఉమ్మడి జిల్లాలో 22 సంఘాలు

రెండు వేల మందికి పైగా సభ్యులు

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 20 : చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే చేనేత సహకార సంఘాల బలోపేతంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కార్యవర్గాలను నియమించేందుకు సన్నద్దమవుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సంఘాలకు ఎన్ని కలు నిర్వహించారు. 2019లో ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్‌, అధికారంలోకి వస్తే చేనేత సహకార సంఘాలను బలోపేతం చేస్తామని, మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘాలను నిర్వీర్యం చేశారు. గత ఐదేళ్లు సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు నామి నేటెడ్‌ పోస్టుల ద్వారా త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా కార్యవర్గాన్ని ఏర్పా టు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించనుంది. టీడీపీ హయాంలో అమలైన మార్కెట్‌ ఇన్‌సెన్‌టీవ్‌, యార్న్‌ సబ్సిడీ, త్రిఫ్ట్‌ ఫండ్‌, ముద్రా రుణాలు వంటి పథ కాలను పునరుద్ధరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ప్రస్తుతం 22 చేనేత సహకార సంఘాలు ఉండగా, 2వేల మందికి పైగా సభ్యులు ఉన్నా రు. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉండడంతో మళ్లీ తమకు మంచిరోజులు వస్తాయని, చేనేత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో నూతన సహకార సంఘాల ఏర్పా టుకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి ఎస్‌.రఘునంద తెలిపారు. వృత్తి చేస్తూ వ్యక్తి గతంగా, మాస్టర్‌ వీవర్‌ కింద చేస్తున్న చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కొత్తగా చేనేత సహకార సంఘాలు ఏర్పాటుకు దర ఖాస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం అందించే రాయి తీలు పొందేందుకు సంఘాలు ఏర్పాటు అయి ఉండాలి. సభ్యు లుగా చేరేవారు నేతవృత్తి, వృత్తే జీవనాధారంగా ఉండాలి. కనీసం 30 మంది సభ్యులు ఉండి, ఒక్కో సభ్యుడికి కనీస షేర్‌ ధనం వెయ్యి రూపాయలు, ప్రవేశ రుసుము రూ.30లు చెల్లించాలి. దరఖాస్తులు టీటీడీ కల్యాణ మండపం వద్ద చేనేత జౌళిశాఖ కార్యాలయం, ఆప్కో షోరూమ్‌పైన అందజేయాలి.

Updated Date - Sep 21 , 2024 | 12:29 AM