Share News

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం : ఐజీ

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:27 AM

హోంగార్డు విభాగం పోలీస్‌శాఖలో అంతర్‌భాగ మైందని వారు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంస నీయమని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ అన్నారు.

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం : ఐజీ
హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌

ఏలూరు క్రైం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : హోంగార్డు విభాగం పోలీస్‌శాఖలో అంతర్‌భాగ మైందని వారు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంస నీయమని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ అన్నారు. హోంగార్డ్‌ డేను పురస్కరిం చుకుని ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్ర వారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీ హాజరయ్యారు. తొలుత హోంగార్డుల పరేడ్‌ను పరిశీలించి గౌరవవంద నాన్ని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ హోంగార్డ్స్‌ పోలీసులతో సమాంతరంగా విధు లను నిర్వర్తిస్తున్నారన్నారు. హోంగార్డు సంక్షేమా నికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులకు సీఎఫ్‌ఎంఎస్‌ నెంబర్‌ తొలగించడం వల్ల ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పథకాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏఆర్‌ ఆర్‌ఐ పవన్‌ కుమార్‌, జిల్లాలోని హోంగార్డుల నిర్వర్తించే విధులను వివరించారు. వివిధ క్రీడల విజేతలైన హోంగార్డులకు ఐజీ, ఎస్పీ బహుమతులం దిం చారు. ఏఎస్పీ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావ ణ్‌కుమార్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, హోంగార్డు యూనిట్‌ ఆర్‌ఎస్‌ఐ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

Updated Date - Dec 07 , 2024 | 12:27 AM