Share News

ఇళ్లు కట్టండి

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:30 AM

కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి వంద రోజుల ప్రణాళిక రూపొందించి లక్ష్యాలను విధించింది. వీటిని చేరు కునే దిశగా జిల్లా హౌసిం గ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 70 వేల ఇళ్లను మంజూరుచేసిం ది.

ఇళ్లు కట్టండి

వంద రోజుల్లో మూడు వేల 159 నిర్మాణాలు పూర్తిచేయాలి

ఇప్పటికే 1,800 గృహ ప్రవేశాలకు సిద్ధం..

భీమవరం టౌన్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి):కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి వంద రోజుల ప్రణాళిక రూపొందించి లక్ష్యాలను విధించింది. వీటిని చేరు కునే దిశగా జిల్లా హౌసిం గ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 70 వేల ఇళ్లను మంజూరుచేసిం ది. అప్పట్లో వీటి నిర్మాణాలకు లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవ డం, ఆర్థిక ఇబ్బందుల వల్లే. దీంతో 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేయిం చారు. ఇంకా 40 వేల నిర్మాణాలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసి వంద రోజుల్లో పూర్తిచేసేలా హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించారు. జిల్లాలో మూడు వేల 159 ఇళ్లు నిర్మించాలి. మూడు నెలలుగా అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి 1,800 ఇళ్లను పూర్తి చేయగలిగారు. మరో 1,359 ఇళ్లను పూర్తి చేస్తే ప్రభుత్వ లక్ష్యాలు పూర్తవుతాయి. ఈ నెలాఖరుకు ఆ నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు దృష్టి పెట్టారు.

రూ.2.50 లక్షలు సాయం

పీఎం ఆవాస్‌ యోజన కింద లబ్ధిదారులకు సబ్సిడీ

జిల్లావ్యాప్తంగా 930 దరఖాస్తులు.. నెలాఖరు వరకు గడువు

నరసాపురం, డిసెంబరు 18(ఆంధ్ర జ్యోతి):తెల్ల రేషన్‌ కార్డుదారులకు స్థలం వుండి ఇల్లు కట్టుకుంటామంటే గతంలో కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు అందించేది. నిర్మాణ సామగ్రి, మెటీరియల్‌ ధరలు భారీగా పెరగడంతో ఈ మొత్తం సరిపోయేది కాదు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. జిల్లావ్యాప్తంగా మధ్య స్తంగా నిలిచిన ఇళ్లు వేలల్లో వున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సొంత గూడు ఏర్పాటు చేసుకునే వారికి తీపి కబురు చెప్పింది. పీఎం ఆవాస్‌ యో జన కింద లబ్ధిదారులకు సబ్సిడీ సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమి ఉంటే చాలు రూ.2.50 లక్షలు సబ్సి డీ సాయం అందించనుంది. ఇందులో కేం ద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇవ్వనున్నారు. తిరిగి చెల్లించాల్సిన అవ సరం లేకపోవడంతో లబ్థిదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. దీంతో చాలా మంది సొంత గూడును కట్టుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 930 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోనే అవకాశం ఉండటంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తుల్లో పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఆసక్తి చూపారు. గ్రామాల నుంచి 840, పట్టణ ప్రాంతం నుంచి 90 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో నరసాపురం, యలమంచిలి, పాలకొల్లు, మొగల్తూరు, పోడూరు, ఆచంట, తాడేపల్లిగూడెం నుంచి అత్యధికంగా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో 75, పాలకొల్లు మండలంలో 82 దాటాయి. తర్వాత స్థానాల్లో మిగిలిన మండలాలు ఉన్నాయి. తక్కువగా భీమవరం, తణుకు, ఉండి మండలాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం టాప్‌లో ఉన్నాయి. లబ్ధిదారుల దరఖాస్తులను సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ సిబ్బంది లేదా హౌసింగ్‌ ఏఈకి అందించాలి. వీటిని ప్రభుత్వం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారికి త్వరలో సబ్సిడీ సాయం బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. దీనిపై ఈఈ పిచ్చయ్య మాట్లాడుతూ ‘నూరు శాతం సబ్సిడీ కావడంతో లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రోజు రోజుకు దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 930 వరకు వచ్చాయి. ఇవన్ని ఆన్‌లైన్‌ చేశాం’ అని చెప్పారు.

ఇవీ నిబంధనలు

సబ్సిడీ సాయం అందుకో వాలంటే లబ్ధిదారులు గతంలో గృహ నిర్మాణ సంస్థ నుంచి హౌసింగ్‌ రుణం తీసుకుని ఉండరాదు.

సొంత స్థలం లేదా ప్రభు త్వం మంజూరు చేసిన స్థలం ఉండాలి.

తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.

ఆదాయ పరిమితి రూ.3 లక్షలలోపు ఉండాలి.

మధ్యస్థంగా నిలిచిన గృహాల కు ఈ స్కీమ్‌ వర్తించదు.

పునాదిలో నిలిచి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తుదారుడు స్థానికుడై ఉండాలి.

Updated Date - Dec 19 , 2024 | 12:30 AM