ఉరుకులు.. పరుగులు
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:02 AM
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే ఆరంభమై ఊపం దుకుంటున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశకు నిధులొచ్చాయి.
జలవనరుల శాఖలో పనుల జోష్.. ఆపై నిధులు
ఆర్‌అండ్‌బీలో గోతులు పూడాయి.. విద్య, వైద్య రంగాల్లో భారీ కదలిక
కూటమి ప్రభుత్వం రాకతో ఎక్కడికక్కడ సమీక్షలు.. నిర్ణయాలు
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే ఆరంభమై ఊపం దుకుంటున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశకు నిధులొచ్చాయి. అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు సన్నాహాలు. గోతుల రోడ్లకు నిధులు ఇచ్చి మోక్షం. ధాన్యం సేకరణలో గత అనుభవాలకు తెరదింపి తక్షణ పరి ష్కారానికి మార్గం సుగమం. మూలన పడి సాగు నీటిసంఘాలకు మళ్లీ జీవం. నిరుద్యోగు లకు ధైర్యం నూరిపోసేలా ఎక్కడికక్కడ శిక్షణ. వయో వృద్ధులకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ కల్పిస్తూ కీలక ఆదేశాలు.. ఇలా ఒకటే మిటి ఇన్నాళ్లు మూలనపడ్డ వాటన్నింటికి నిర్వీర్యం స్థానంలో ఉత్తేజం నెలకుంటోంది.
(ఏలూరు – ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ప్రభుత్వ శాఖల్లో గడిచిన ఐదేళ్లు నిర్వేదం, చేతినిండా పనిలేనితనం. రాజకీయ ప్రేరేపిత కుట్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్కొ వ్యవస్థ తెరమరుగవుతూ వచ్చింది. ఉద్యోగులు, అధికారులదే ఇష్టారాజ్యం. సర్పంచి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకూ చేష్టలూడిగి నిర్వేదమైన చేదు అనుభవాలవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు గడిచే లోపు మూలనపడ్డ వ్యవస్థలను గాడిన పెడుతున్నారు. మద్యం విక్రయాల్లో నానాయాగీ చేసి పైపైకి నిషేధం అంటూ గడిచి ఐదేళ్లు జగన్ సర్కారు ప్రజలను ఏమార్చింది. ఇప్పుడు వాటి స్థానంలో నూతన మద్యం విధానం అమల్లోకి తేవడమే కాకుండా నాణ్యమైన మద్యం అందు బాటులోకి తెచ్చారు.
చింతలపూడి ఎత్తిపోతలకు కదలిక
లక్షలాది ఎకరాలకు సాగునీరు, 25 గ్రామాలకు తాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల తొలి దశను 2026 నాటికే అధిగమించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించారు. దీనికి తగ్గట్టుగానే తాజాగా బడ్జెట్‌లోనూ కేటాయింపులు చేశారు. పెండింగ్ బిల్లులు అన్నింటికి నిధులు సమకూర్చారు. ఈ ఎత్తిపోతల కింద అక్కడక్కడ భూసేకరణ అడ్డంకిగా మారిన పరిస్థితుల్లో దానిని పరిష్కరించేం దుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగి రైతులతో సంప్రదింపులు చేస్తు న్నారు. ఇంకోవైపు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉమ్మడి పశ్చిమ వాసి కావడతో ఈ ప్రాంతంలో జలవనరులకు ఎలాం టి లోటు లేకుండా నిర్థిష్ట ప్రణాళికలను ఆయనే పర్యవేక్షిస్తుండడంతో జలవనరుల విభాగంలో ఇప్పుడు ఫైళ్లు కదులుతున్నాయి. గతంలో నీరు– చెట్టు పథకం కింద చేసిన పనులకు ఈ మధ్యనే రూ.20 కోట్లకు పైగా బకాయిలను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. ఎప్పుడో నీరస పడిన తాగునీటి సంఘాలకు మళ్లీ ఎన్నికల రూపంలో జీవం పోస్తున్నారు.
ప్రభుత్వ శాఖలకు పని..
ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో వున్న నిశ్శబ్దాన్ని క్రమేపీ తొలగిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో గడచిన ఐదేళ్లు అరకొర పనులు తప్ప నిధులు కేటా యింపులు లేవు. కూటమి ప్రభుత్వం జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రహదారులకు తాత్కాలిక మర మ్మతులకు రూ.70 కోట్లు, శాశ్వత మరమ్మతు లకు రూ. 120 కోట్లు కేటాయించడంతో రోడ్ల మరమ్మతు పనులు పుంజుకున్నాయి. సంక్రాంతి పండుగ లక్ష్యంగా పూర్తి చేయాలని అధికారులు కార్యాచరణ చేస్తున్నారు. పంచాయతీరాజ్ విభా గంలో గడిచిన కొన్నేళ్ల క్రితం నిలిచిపోయిన పనులన్నింటిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ గాడిపెట్టారు. పంచాయతీరాజ్ రోడ్లకు మోక్షం వచ్చింది. పల్లెల్లో ఉపాధి హామీ పనుల కింద రోడ్ల మరమ్మతులకు పని దొరికింది. ఇంటింటికి కుళాయి పథకం వేగవంతం చేశారు. ఈ వేసవి నాటికే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాలను అధిగమించా లని ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూశాఖలో వున్న నిర్వేదాన్ని ఈ ఐదు నెలల వ్యవధిలోనే పార ద్రోలారు. రెవెన్యూ పరంగా కీలకంగా వ్యవహరించడానికి వీలుగా ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. రేషన్ సరుకులు పంపిణీలోనూ ఒడిదుడుకులను తొలగించారు. సూపర్ సిక్స్ కింద ఏడాదికి మూడు సిలిండర్ల పథకం దాదాపు సక్సెస్ అయింది. ధాన్యం సేక రణలో 48 గంటల్లోనే ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యలో నిలిచిన గృహాలను పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 53 వేల ఇళ్లను పూర్తి చేసే ఏర్పాట్లలో వున్నారు. విద్య, వైద్య రంగాల్లో ఆయా శాఖాధిపతులు నిత్య సమీక్షలతో ప్రగతిని సాధించే దిశగా పరుగులు పెడుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం సరికొత్త మార్పు కన్పిస్తోందన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.