Share News

ఐజీగా అశోక్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jan 02 , 2024 | 12:17 AM

ఏలూరు రేంజ్‌ ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఐపీఎస్‌ అధికారి జీవీజీ అశోక్‌కుమార్‌ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.

ఐజీగా అశోక్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

ఏలూరు క్రైం, జనవరి 1: ఏలూరు రేంజ్‌ ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఐపీఎస్‌ అధికారి జీవీజీ అశోక్‌కుమార్‌ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. డీఐజీగా వున్న ఆయనకు ఇటీవల ఐజీగా పదోన్నతి లభించింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరులోని తన కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. రేంజ్‌లోని ప్రజలకు, పోలీస్‌ సిబ్బంది అంధిరికి శాంతి, శ్రేయస్సు, సంతోషం, ఉల్లాసం అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను కలిసి పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 02 , 2024 | 12:17 AM