Share News

ఎన్నికల కోడ్‌.. లెక్కలేదు

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:40 AM

ఉమ్మడి గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పోలింగ్‌ జరగనుంది. మంగళవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలను మూసి వేయించారు.

ఎన్నికల కోడ్‌.. లెక్కలేదు
తాడేపల్లిగూడెం పట్టణంలో స్వాధీనం చేసుకున్న మద్యం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మద్యం దుకాణాలు మూత

ఉమ్మడి జిల్లాలో అక్రమ విక్రయాల జోరు

ఎక్సైజ్‌ అధికారుల దాడులు

ఉమ్మడి గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పోలింగ్‌ జరగనుంది. మంగళవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలను మూసి వేయించారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో బుధవారం జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. పలుచోట్ల ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేశారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపు లోకి తీసుకున్నారు. పలుచోట్ల బెల్ట్‌ షాపు నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.

భీమవరం క్రైం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు భీమవరం ఎక్సైజ్‌ సీఐ కె.బలరామరాజు తెలిపారు. వనిమ కృష్ణమూర్తిని అరెస్ట్‌ చేసి 16 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడులలో పిఎస్‌ డి భోగేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భీమవరం మండలం తాడేరులో పాలపర్తి జాన్‌ రత్నకుమార్‌ వద్ద 6 మద్యం సీసాలు స్వాధీ నం చేసుకున్నారు.

పాలకొల్లు రూరల్‌: పట్టణానికి చెందిన పి శ్రీనివాసు వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్టు సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు.

ఇరగవరం: అక్రమంగా మద్యం విక్రయి స్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ ఎస్‌ మణికంఠరెడ్డి తెలిపారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన గరగ శ్రీను వద్ద నుంచి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసు కున్నారు. వివిధ మద్యం షాపుల నుంచి కొను గోలు చేసిన అధిక ధరలకు విక్రయించే క్రమంలో అధికారులు అరెస్టు చేశారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌: పట్టణంలోని యాగర్లపల్లిలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పట్టణ ఎక్సైజ్‌ ఇన్స్పెక్టర్‌ ఇ.స్వరలక్ష్మి తెలిపారు. ఇతని వద్ద నుండి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్‌ఐ మురళిమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పెంటపాడు: మండలంలోని పరిమెళ్ళ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి 48 మద్యం బాటిల్స్‌ స్వాధీ నం చేసుకున్నామని ఎక్సైజ్‌ సీఐ ఆర్‌.భోగేశ్వర రావు తెలిపారు. నిందితుడిని తాడేపల్లిగూడెం ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: పట్టణంలో అక్రమంగా మధ్య విక్రయిస్తున్న గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన మేడిచర్ల మోహన్‌ నుంచి 46 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై బాదం శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.

కుక్కునూరు: మండల పరిధిలోని కొండపల్లిలో ఎక్సైజ్‌ శాఖ జరిపిన దాడిలో 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో టాస్క్‌పోర్సు ఎస్సై ఎండీ అరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చింతలపూడి: ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో తడికలపూడి గ్రామానికి చెందిన మొటపర్తి వీరభద్ర మద్యం బెల్టు షాపు నిర్వహిస్తుండ డంతో కామవరపుకోట తహసీల్దార్‌ ముందు హాజరుపరిచారు. మొదటి విడత బైండోవర్‌ను అతిక్రమించినంద రూ.20 వేల జరిమానా విధించారని సీఐ పి.అశోక్‌ తెలిపారు. అతడి వద్ద మరో 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని బైండోవర్‌ చేశామన్నారు. కామవరపుకోటకు చెందిన వీరంశెట్టి సురేష్‌కుమార్‌ నుంచి 20 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని బైండోవర్‌ నమోదు చేసినట్టు తెలిపారు.

జంగారెడ్డిగూడెం: ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం పలుచోట్ల దాడులు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో గుమ్ములూ రి ముసలయ్య వద్ద 39 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనుబాబు తెలిపారు. లక్కవరం లో పులపాకుల సత్యనారాయణ వద్ద 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుకునూరు మండలం కొండపల్లిలో లోతోట వెంకటేశ్వరరావు వద్ద 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఏలూరు క్రైం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో ఒక వ్యక్తి దగ్గర మద్యం బాటిల్స్‌ ఉన్నట్లు ఏలూరు త్రి టౌన్‌ సీఐ ఎస్‌ కోటేశ్వరరావుకు సమాచారం అందడంతో తన సిబ్బందితో బుధవారం రాత్రి దాడి చేశారు. ఏలూరు రామకృష్ణాపురం భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రునకు చెందిన అరిగల విజయ్‌రమేష్‌ 30 మద్యం బాటిల్స్‌ను కల్గి ఉన్నాడు. దీంతో అతనిని అరెస్టు చేసి అతని నుంచి బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 05 , 2024 | 12:40 AM