Share News

Nimmala Rama Naidu: జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 18 , 2024 | 01:22 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు.

Nimmala Rama Naidu: జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Nimmala Ramanaidu

పాలకొల్లు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు. ‘‘యువతకు గంజాయి సంస్కృతిని నేర్పిన జగన్‌కు.. ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు’’ అని మండిపడ్డారు.


యలమంచిలి మండలం కాంబొట్లపాలెంలో వరద బాధితులకు మంత్రి నిమ్మల నిత్యావసర సరుకులను అందించారు. రూ.10 లక్షల వ్యయంతో రహదారుల నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పాలకొల్లులోని ఆయన కార్యాలయంలో పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలను కలిశారు. కొందరు తమ ప్రాంతంలో సమస్యలపై తెలపగా ఇంకొందరు వ్యక్తిగత సమస్యలను చెప్పుకున్నారు. మంత్రి రామానాయుడు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యను ఆలకించి కొన్నిటికి అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కలిశారు.


79 ఎకరాలు కబ్జా చేశారు: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

జగన్నాథ గట్టు దగ్గర ఆక్రమణకు గురైన భూములను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె.. లక్ష్మీపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరులు, ఓ కానిస్టేబుల్ 79 ఎకరాల భూమిని కబ్జా చేశారని అన్నారు. దేవాలయాలు, ప్రభుత్వ బడులు, కాలేజీలు, ఆస్పత్రుల భూములను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఆక్రమించారని ధ్వజమెత్తారు. ఇటీవల నంద్యాల జిల్లాకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఐదేళ్లలో ఎన్నో చేశానని గొప్పలు చెప్పారని, కానీ కాటసాని అనుచరుల భూకబ్జాలు వైయస్ జగన్‌కు తెలియవా అని ఆమె ప్రశ్నించారు.


మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు భూకబ్జాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారని ఎంపీ బైరెడ్డి శబరి ప్రస్తావించారు.


కాగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమార్కులు జగన్నాథగట్టు భూములను అప్పనంగా దోచేశారని ఇటీవలే ఎంపీ అన్నారు. కోట్ల విలువైన ఎకరాల భూములను యధేచ్చగా కబ్జా చేసేశారని, ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే, అక్రమాలకు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని, అక్రమార్కుల గుట్టు రట్టు చేయడానికి సిద్ధమైందని ఆమె హెచ్చరించారు.

Updated Date - Aug 18 , 2024 | 01:22 PM