జాతీయ సమైక్యతతోనే దేశ సమగ్రత : జేసీ
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:52 AM
జిల్లా వ్యాప్తంగా గ్రంథాల య వారోత్సవాలు ఆరోరోజు మంగళవారం కొనసాగాయి. జాతీయ సమైక్యతతోనే దేశ సమగ్రత అని, బాల్యం సమైక్యత భావాలు కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు.
భీమవరంటౌన్/ భీమవరం రూరల్, నవంబ రు 18 (ఆంధ్రజ్యోతి) :జిల్లా వ్యాప్తంగా గ్రంథాల య వారోత్సవాలు ఆరోరోజు మంగళవారం కొనసాగాయి. జాతీయ సమైక్యతతోనే దేశ సమగ్రత అని, బాల్యం సమైక్యత భావాలు కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని భారతీయ విద్యా భవన్ స్కూల్‌లో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ సమైక్యత ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాల యంలో ఇంగ్లీషు అధ్యాపకురాలు కె.అన్నామణి ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారిత, మహిళా సంరక్షణ’ అనే అంశంపై మాట్లాడారు. శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో కళాశాల డైరెక్టర్ ఎం.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఎ.అనురాధ ఆధ్వర్యం లో డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
పాలకొల్లు అర్బన్ : నేటి తరానికి గ్రంఽథాల యాలు ఉపయోగపడతాయని పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు అన్నారు. కళాశాలలోపుస్త్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. పాలకొల్లు శాఖ గ్రంథాలయంలో మహిళా సాధికారిత అన్న అంశంపై విశ్రాంత ఉపాధ్యాయిని నందుల రమణి మాట్లాడారు. తొలుత ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
కాళ్ళ/ఆకివీడు రూరల్/ఉండి/ : కాళ్ల మండలం కోపల్లె శాఖ గ్రంథాలయంలో చినఅమిరం జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వి.అనురాధ ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆకివీడు మండలంలోని వీవీగిరి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ సుజాత ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఉండి శాఖ గ్రంథాలయంలో దాత నల్లా పౌండేషన్ అధినేత నల్లా సత్య కిరణ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
తణుకు : తణుకు ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మహిళ సమస్యలు సామాజిక సేవా దృక్పథం అనే అంశంపై మంగళవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు.
నరసాపురం టౌన్ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వనిత, లయన్స్ క్లబ్‌ల సభ్యులు అన్నారు. శాఖ గ్రంథాలయంలో మహిళా దినోత్సవం, క్విజ్ పోటీలు నిర్వహించారు.
పెంటపాడు :మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆదిత్యా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.లక్ష్మీసరోజ అన్నారు. పెంటపాడు నక్కా వెంక టేశ్వరరావు శాఖ గ్రంథాలయంలో గ్రంథాల యాధికారి ఎండీ. జుల్పిఖర్ అధ్యక్షతన ‘మహిళా సాధికారత, మహిళల రక్షణ’ అనే అంశంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.