Share News

కార్తీక పూజలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:36 AM

రాయకుదురులో ఉన్న ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా శనివారం నుదురుపాటి కోదండరామమూర్తి, సీతామహాలక్ష్మి, వేద పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. పార్వతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మల్లేశ్వర స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు.

కార్తీక పూజలు

ఆలయాల్లో అన్నసమారాధనలు

వీరవాసరం (భీమవరంటౌన్‌)/భీమవరం టౌన్‌/ఉండి నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాయకుదురులో ఉన్న ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా శనివారం నుదురుపాటి కోదండరామమూర్తి, సీతామహాలక్ష్మి, వేద పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. పార్వతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మల్లేశ్వర స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు. నుదురుపాటి భానుమూర్తి, నుదురుపాటి బాలగంగాధరం, నుదురుపాటి రామశర్మ, తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఉండి రాజులపేటలోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం పూజలు శనివారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని ఆకివీడు సీఐ జగదీశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వాదాలు అందించారు

అన్నసమారాధనలు

ఆకివీడురూరల్‌ :చినకాపవరంలోని పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో శనివారం కార్తీకమాస అన్నసమారాధన ఘనంగా జరిగిం ది. గత కొన్నేళ్లుగా గ్రామస్థులందరూ ఒకేచోట చేరి కలిసిమెలిసి అన్నప్రసాధాన్ని స్వీకరిస్తున్నా మని నిర్వాహకులు తెలిపారు. నందమూరి సత్యవతి, యర్రంశెట్టి బాలాజీ, బాబ్జి పాల్గొన్నారు.

కాళ్ళ, : కాళ్లలోని రుక్మిణి సమేత పాండురంగస్వామి కల్యాణోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన నిర్వహించారు. తొలుత స్వామివారికి నైవద్యం సమర్పించారు. కమిటీ సభ్యులు బండారు నాయుడు, నారిన తాతయ్య, బండారు వేణుగోపాలరావు, గోళ్ళ నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, నారిన శ్రీనివాసరావు, కడలి దుర్గాప్రదీప్‌, బండారు సాయి పద్మారావు, పాల్గొన్నారు.

భీమవరంటౌన్‌ : కార్తీక మాసం సందర్భంగా భీమవరం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని పద్మావతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద కార్తీక వనసమారాధన నిర్వహించారు. అల్లం నాగరమేష్‌, ధనలక్ష్మిసత్యవాణి దంపతులచే కార్తీక దామోదర పూజ చేయించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.

Updated Date - Nov 17 , 2024 | 12:36 AM