Share News

కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:44 AM

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి.

కిటకిటలాడిన శైవ క్షేత్రాలు
పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి రేవులో దీపారాధన

వైభవంగా కార్తీక దీపారాధన

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజామునుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయం లో మహిళలు 365 ఆవు నేతి వత్తులను వెలిగించారు. సాలగ్రామ, ఉసిరి, దానాలు చేసుకున్నారు. నవ వధువులతో కుటుంబ సభ్యు లు స్వామి, అమ్మవార్లకు పసుపు, కందమొక్క, బియ్యం, జాకెట్టు ముక్కతో వాయినం అందించారు. కార్తీక చంద్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్ష విరమించారు. రాత్రి ఆలయం వద్ద జ్వాలా తోరణం వెలిగించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిం చుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆచంటేశ్వరుడి ఆలయం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భక్తులతో పోటెత్తింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. పట్టిసీమ శివక్షేత్రంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి బిల్వార్చన, భస్మార్చన ఏకాదశ రుధ్రాభిషేకాలు నిర్వహిం చారు. పట్టిసీమ ఫెర్రీ రేవులో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఏక దీప హారతి, త్రిదీప హారతి, పంచదీప హారతి, అష్టోత్తర దీపహారతి, కుంభ హారతి , ధూప హారతి నిర్వహించారు. అనంతరం పట్టిసీమలో జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించారు. గోదావరి హారతి కార్యక్రమంలో వేద పండితులు అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు సిద్ధాం తం వశిష్ట గోదావరి పంచ హారతులు వైభవంగా నిర్వహించారు. ఏక ముఖ, ద్విముఖ, చతుర్ధ పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణకుంభ, సర్ప హారతుల కార్యక్రమం నిర్వహించారు. పంచహారతుల సందర్భంగా గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. నరసాపురం గోదావరి తీరంలో వలంథర్‌ రేవు భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూ లల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోదావ రిలో స్నానాలు చేసి కార్తీకదీపాలు విడిచి పెట్టారు. పలువు రు గట్టుపై నోములు నోచుకున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:44 AM