Share News

సిరుల పంట

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:29 AM

జిల్లాలో ధాన్యం ఉత్పత్తులు అంచనాలను మించుతున్నాయి. ప్రభుత్వానికి విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదైన ఒక్క రోజు వ్యవధిలోనే రైతు ఖాతాలో సొమ్ములు జమవుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ముంపుబారి నుంచి ఒడ్డెక్కిన పం ట పొలాల్లో ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నాయి.

సిరుల పంట

అంచనాలకు మించి ధాన్యం ఉత్పత్తులు

జిల్లాకు అదనంగా 30 వేల టన్నులు ఇవ్వాలి

ప్రభుత్వానికి లేఖ రాసిన జిల్లా అధికారులు

ఖరీఫ్‌లోనూ ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగింత

రేషన్‌లో ఖరీఫ్‌ బియ్యానికే ప్రభుత్వం మొగ్గు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం ఉత్పత్తులు అంచనాలను మించుతున్నాయి. ప్రభుత్వానికి విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదైన ఒక్క రోజు వ్యవధిలోనే రైతు ఖాతాలో సొమ్ములు జమవుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ముంపుబారి నుంచి ఒడ్డెక్కిన పం ట పొలాల్లో ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నాయి. ఫలితంగా మరో 30 వేల టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని జిల్లా అధికారు లు ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే అనుమతులు రానున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా నుంచి 4.10 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారుల నుంచి తాజాగా నివేదికను తీసుకున్నారు. మరో 30 వేల టన్నుల ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉందని అంచ నాకు వచ్చారు. మూడు రోజుల క్రితం జిల్లా రైస్‌మిల్లర్లతో జేసీ రాహు ల్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలుతోపాటు, బియ్యం డెలివరీపైనా చర్చించారు. బియ్యాన్ని వేగవంతంగా అప్పగించాలని మిల్లర్లకు సూచించారు.

రేషన్‌లో ఖరీఫ్‌ బియ్యానికే మొగ్గు

ఖరీఫ్‌లో ఉత్పత్తయ్యే బియ్యాన్ని జిల్లా అవసరాల కోసం వినియోగించుకునేవారు. రేషన్‌ కోసం ఇతర జిల్లాలకు తరలించేవారు. రబీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐకి అప్పగించేవారు. రబీ బియ్యాన్ని రేషన్‌లో సరఫరా చేస్తే జిల్లా ప్రజలు వినియోగించడం లేదు. మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కిలో బియ్యానికి రూ.15 అమ్ముతున్నారు. చివరకు రేషన్‌ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్నాయి. అదే ఖరీఫ్‌లో ఉత్పత్తయ్యే బియ్యాన్ని సరఫరా చేస్తే 70 శాతం సొంత అవసరాలకు వినియోగించుకుంటారు. రబీ బియ్యం పూర్తిగా మార్కెట్‌కు తరలిపోతోంది. ఫలితంగా గతంలో అధికారులు రబీలో సేకరించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ కి అప్పగించేవారు. ఖరీఫ్‌ బియ్యాన్ని రేషన్‌కు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది. సకాలంలో రైతులకు సొమ్ములు చెల్లించలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటలు గడవక ముందే సొమ్ములు రైతుల ఖాతాలో సొమ్ములు జమ అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 25 శాతం బియ్యాన్ని ఖరీఫ్‌లో ఎఫ్‌సీఐకి ఇవ్వాలని జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. మిల్లర్లు అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు. ఎఫ్‌సీఐ అందుకు సిద్ధంగా ఉంది.

ఖరీఫ్‌ బియ్యం ఎఫ్‌సీఐకి

జిల్లాలో ధాన్యం సేకరణ పెంచాలంటే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు 25 శాతం బియ్యం అప్పగించాలని ప్రభుత్వం సూచించింది. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా సరే రైతులకు 24 గంటల్లో సొమ్ములు జమ చేస్తోంది. అదనంగా ధాన్యం కొనుగోలు చేయాలంటే ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితి లేదు. అదే ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగిస్తే పౌరసరఫరాల కార్పొరేషన్‌కు బిల్లులు జమ చేస్తోంది. అదే సొమ్మును మళ్లీ రైతు ఖాతాల్లోకి జమ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి గట్టెక్కుతుంది.

Updated Date - Dec 29 , 2024 | 12:31 AM