Share News

కొఠారు ఇంటి వద్ద వంటా వార్పుతో నిరసన

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:36 AM

మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి స్వగ్రామం కొండలరావుపాలెంలోని ఆయన స్వగృహం దగ్గర కొల్లేటి లంకగ్రామాల వారు మంగళవారం వంటా వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

కొఠారు ఇంటి వద్ద వంటా వార్పుతో నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న కొల్లేటి లంక వాసులు

నాలుగో రోజు కొనసాగిన కొల్లేటివాసుల ఆందోళన

పెదవేగి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి స్వగ్రామం కొండలరావుపాలెంలోని ఆయన స్వగృహం దగ్గర కొల్లేటి లంకగ్రామాల వారు మంగళవారం వంటా వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పైడిచింతపాడు, తిమ్మావారిగూడెం, మానూరు. లింగారావుగూడెం గ్రామాల ప్రజలు నాలుగో రోజు ఆందోళనలో పాల్గొ న్నారు. కొఠారు ఇంటి ఎదురుగా వంటా వార్పు చేపట్టి, అక్కడే సహ పంక్తి భోజనాలు చేశారు. ఆయా గ్రామాల నాయకులు మాట్లాడుతూ కొఠారు అబ్బయ్యచౌదరి 2019–24 సంవత్సరాల మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ చెరువుల ఆదాయాన్ని బొక్కేశారన్నారు. కౌలు సొమ్ము ఇస్తామని తన చుట్టూ తిప్పుకుని, ఆపై తండ్రీ, కొడుకులిద్దరూ ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాకు రావాల్సిన సొమ్ము ఇచ్చేవరకు వదిలిపెట్టబోమని, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతల రవి, సైదు సత్యనారాయణ, మండలి రాజేంద్రప్రసాద్‌, ఘంటసాల కాసులు, కొరపాటి రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:36 AM