పేదల ఇళ్ల పేరుతో భూ దందా !
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:25 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలను వెలికి తీస్తున్నారు. ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో సేకరించిన భూముల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. పెద్ద మొత్తంలో చేతులు మారాయి.
అధిక ధరలకు భూముల కొనుగోలు
లబ్ధిదారుల నుంచి వసూలు
భీమవరంలో రూ.50 కోట్లు చేతులు మారాయంటూ ఫిర్యాదులు 8 వైసీపీలో జరిగిన దందాపై అధికారుల విచారణ
భీమవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలను వెలికి తీస్తున్నారు. ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో సేకరించిన భూముల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. పెద్ద మొత్తంలో చేతులు మారాయి. మారె ్కట్ ధర కంటే అధికంగా సొమ్ములు చెల్లించి అప్పట్లో భూములను కొనుగోలు చేశారు. వైసీపీ నేతలు భారీగా లబ్ధి పొందారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే అవినీతి నీడ వెంటాడుతూనే ఉన్నది. భీమవరం నియోజకవర్గంలోనూ భూముల కొనుగోళ్లులో అవకతవ కలు జరిగాయని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ముఖ్యంగా ఉపముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్‌కు భీమవరంకు చెందిన కొందరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమిలో దాదాపు రూ.50 కోట్ల మేర చేతులు మారాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పవన్‌కల్యాణ్ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా రెవెన్యూ శాఖ వైసీపీ హయాంలో సేకరించిన భూముల వివరాలు సేకరించింది. వాస్తవానికి భీమవరంలో మాత్రమే కాదు. జిల్లావ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో భూ దందా నడిచింది.
ఎకరం విలువ రూ.50 లక్షలే
భీమవరం రూరల్ మండలం యనమదుర్రు కాలువ సమీపంలో సుమారు 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరానికి రూ.1.5కోట్లు చెల్లించారు, వాస్తవంగా మార్కెట్‌లో అంత ధర లేదు. ఎకరం రూ.50 లక్షలు లోపే ఉంటుందని అంచనా. అయినా సరే అధిక మొత్తంలో రైతుల నుంచి కొనుగోలు చేసేలా వైసీపీ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై ఆ మచ్చ పడింది. వైసీపీ నేతల మద్దతు లేనిదే అత్యధిక ధరలకు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసే అవకాశం లేదని అంతా భావించారు. పెద్ద అవకతవకలు చోటు చేసుకున్నట్లు భీమవరం ప్రజలు అంతా కోడై కూశారు. ఎన్నికలు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. వైసీపీ హయాంలో భూదందా జరిగిందంటూ అస్త్రాలు సంధించాయి. గ్రంధి శ్రీనివాస్ పైనా బాణాలు ఎక్కుపెట్టారు. తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గతంలో జరిగిన అక్రమాలను తవ్వి తీస్తుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి వివరాలను రాబట్టింది. అప్పట్లో రిజిస్ట్రేషన్ విలువ, స్థానిక విలునును బేరేజు వేసుకుంటున్నారు.
పూడిక లేని భూములు
వైసీపీ హయాంలో పేదల ఇళ్ళ కోసం సేకరించిన 75 ఎకరాల భూమిని ఇప్పటికీ పూడిక చేయలేదు. వర్షాలు కురిస్తే పెద్ద చెరువులా మారిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సదరు భూములను పూడిక చేయాలన్న ద్యాస లేకుండా పోయింది. మట్టి దొరకలేదని సాకును చూపించారు. కానీ రియల్ ఎస్టేట్ భూముల్లో పూడికకు మాత్రం మట్టిని తరలించారు. పేదల ఇళ్ళకు సేకరించిన భూములను మాత్రం వదిలేశారు. అదే భూమిలో పట్టాలు మంజూరు అయిపోయాయి కానీ ఎవరి స్థలం ఎక్కడ ఉందో తెలియని గందరగోళం నెలకొంది
దొరికితే దొంగలు
వాస్తవానికి జగనన్న కాలనీల పేరుతో జిల్లా వ్యాప్తంగా భూములను కొనుగోలు చేశారు. ప్రభుత్వం అధిక మొత్తం లో రైతు లకు సొమ్ములు చెల్లించింది. అదే నెపంతో వైసీపీ నేతలు లబ్ధిదారుల నుంచి సొమ్ము లు దండుకున్నారు. తొలుత ఈ విషయా న్ని అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. ఆచంట నియోజకవర్గంలో భూ అక్రమాలు జరుగుతున్నాయని మండి పడ్డారు. అప్పట్లో ఈ చర్చ పెద్ద కలకలమే రేపింది. తణుకు నియోజకవర్గంలోనూ భూ సేకరణపై లబ్ధిదారుల నుంచి సొ మ్ములు దండుకున్నారు. ఒక్కో సెంటు భూమికి పూడిక పేరుతో లబ్ధిదారుని వద్ద కనిష్టంగా రూ.50 వేలు వంతున వసూలు చేశారు. ఇలా ప్రభుత్వం అధిక ధరలు ఇచ్చి నష్టపోయింది. స్థలాలు పొందిన లబ్ధిదారులు సొంత సొమ్ములు చెల్లించి అప్పుల పాలయ్యారు. మొత్తానికి వైసీపీ లో జరిగిన భూ దందా ఇప్పటికీ అధి కారులను వెంటాడుతునే ఉంది. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో విచారణ చేపడుతున్నారు.