Share News

జలవనరులకు జవసత్వాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:23 AM

మరో ఐదు రోజుల్లో 2024 సంవత్సరం వెళ్లిపోతోంది. 2025 వస్తున్న వేళ.. ఈ ఏడాది చోటు చేసుకున్న చీకటి వెలుగులను సమీక్షించుకుందాం. నీటిపారుదల శాఖ పనితీరును తెలుసు కుందాం.

 జలవనరులకు జవసత్వాలు

ఈ ఏడాది జల వనరులు అటూ ఇటు

వైఫల్యాలస్థానే పనులవైపు అడుగులు

కేంద్రం సాయం.. రాష్ట్రం సంకల్పం

పోలవరం పూర్తికి ప్రత్యేక కార్యాచరణ

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి

పశ్చిమకు నీటిపారుదల మంత్రిత్వ శాఖ

నిమ్మలకు అవకాశం.. పశ్చిమకు రూ.8 కోట్లు.. ముంపు నివారణకు చర్యలు .

జ్ఞాపకాలు – 2024

మరో ఐదు రోజుల్లో 2024 సంవత్సరం వెళ్లిపోతోంది. 2025 వస్తున్న వేళ.. ఈ ఏడాది చోటు చేసుకున్న చీకటి వెలుగులను సమీక్షించుకుందాం. నీటిపారుదల శాఖ పనితీరును తెలుసు కుందాం.

ఐదేళ్లపాటు పడకేసిన ప్రాజెక్టులకు ఆరు నెలల నుంచి మోక్షం వచ్చింది. వైసీపీ పాలనలో పోలవరం దగ్గర నుంచి డెల్టా ఆధునికీకరణ వరకు అన్నింటికీ గండాలే. వీటి పనులకు నిధులు కేటాయించినట్టే కేటాయించి చివరకు విడుదల కాకుండా నాటకాలాడి రైతులను మోసం చేశారు. ఆ నిర్లక్ష్యం స్థానంలో కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ నిధులు, పనులు సమకూ ర్చింది. పోలవరాన్ని వచ్చే రెండున్న రేళ్లలో పూర్తి చేసేందుకు పనులకు అత్యవసర కార్యాచరణ ప్రకటించింది. డెల్టాలో కాల్వల పూడిక తీతకు ఎనిమిది కోట్లు విడుదల చేసింది. పశ్చిమకు నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించడం ఇదే తొలిసారి.

ఆ బాధ్యతను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఈ ఏడాది ఇవే జలవనరుల శాఖలో అతి ముఖ్య చర్యలు.

(ఏలూరు – ఆంధ్రజ్యోతి) :

ఈ ఏడాది జల వనరుల శాఖలో చీకటి వెలుగులున్నాయి. తొలి ఆరు నెలల్లో అధికారంలో ఉన్న వైసీపీ అప్పటివరకు పోలవరం ప్రాజెక్టును పడకేసేలా చేసింది. కేవలం ప్రాజెక్టు పనుల్లో ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం 72 శాతం పూర్తి చేయగా, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 3.1 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ వ్యత్యాసాన్ని గమనిస్తే ఏ ప్రభుత్వంలో ఎంత పని జరిగింది ఇట్టే తెలుస్తుంది. దీనికితోడు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలులోను జగన్‌ ప్రభుత్వం చూసీచూడనట్టుగా వదిలేసింది. ఒకప్పుడు పోలవరం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందనే విష యాన్ని పక్కన పెట్టి కేవలం టీడీపీపై కక్ష పూరితంగానే అన్నట్టుగా వ్యవహరించింది. కుడికాల్వకు కనెక్ట్‌య్యేలా నిర్మిస్తున్న జంట గుహలు కుప్పకూలినా దిక్కుదివాణం లేదు. ఆఖరుకి ప్రధాన డ్యాం నిర్మాణానికి అడ్డంకిగా డయా ఫ్రంవాల్‌ మారడానికి ఆనాటి ప్రభుత్వమే కారణ భూత మైంది. 2022లో డయాఫ్రంవాల్‌ గోదావరి వరదలతో దెబ్బ తింది. కనీసం నిపుణులతో చర్చించి ప్రత్యా మ్నాయం ఏం చేయాలనే దానిపైన సరైన నిర్ణయం తీసుకో లేకపోయింది. జల విద్యుత్‌ కేంద్రం పనులు ముందుకు వెళ్ళక సాగిల పడ్డాయి. కనీసం కేంద్రాన్ని ఒప్పించి సంతృప్తికర నిధులు రప్పించారా అంటే దానిలోనూ విఫలమే. ఆర్‌అండ్‌ఆర్‌ పనుల్లోను ఇదే నిర్లక్ష్యం. నిర్వాసిత కుటుంబానికి రూ.ఐదు న్నర లక్షలకు బదులుగా రూ.పది లక్షలు వ్యక్తిగత పరిహారం మంజూరు చేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చి అధి కారంలోకి వచ్చిన తర్వాత దీనిని గాలిలో కలిపారు. ఎన్నికలకు ముందు ఓట్లను దండుకునేందుకు కేవ లం కొంతమందికి మాత్రమే వ్యక్తిగత పరిహా రం వారి ఖాతాల్లో జమ చేశారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనలోనూ వైసీపీ నిర్లక్ష్యం అంతాఇంతా కాదు. అతి ముఖ్యమైన మెట్టకు సాగు, తాగునీరు అందించే పథకాలను గోదారిలో కలిపినట్టుగా వ్యవహరించింది. కనీసం డెల్టా ఆధునికరణ పనులకు దిక్కులేకుండా పోయింది. ఏ బడ్జెట్‌లోనూ తగినన్ని కేటాయింపులు ఇవ్వలేదు. జగన్‌ ప్రభుత్వ హయాం అంతా జల వనరుల విభాగంలో అంతా నగుబాటగానే సాగింది.

కూటమిలో ప్రాజెక్టులు దీటుగా..

వైసీపీ పాలనలో ఏదైతే వైఫల్యాలను మూటకట్టుకుందో తాజాగా ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్వల్పకాలంలోనే విజయాల వైపు దూసుకెళ్తుంది. పోలవరం ప్రాజెక్టుకు జవసత్వాలు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సోమవారం పోలవరంగా స్ఫూర్తి కొన సాగిస్తూ అధికార పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోపే రెండు సార్లు ప్రాజెక్టును సందర్శించి పనులను పర్యవేక్షించి నిపుణులతో, ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. ఆ మేరకు కేంద్రానికి నివేదించారు. తగినన్ని నిధులు కోసం అభ్యర్ధించే తడవుగా రూ.12,800 కోట్లు తక్షణ పనుల కోసం మొదటి దఫాగా కేంద్రం విడుదల చేసింది. కాలయాపన జరగకుండా నిపుణుల సలహాలు తీసుకుంటూనే పనుల పూర్తికి కాంటాక్టు ఏజెన్సీని అప్రమత్తం చేసి ఇంజనీర్లకు ఆ మేరకు బాధ్యతలు అప్పగించారు. వైసీ పీ హయాంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ రెండోసారి నిర్మాణానికి సమా యత్తమయ్యారు. వైసీపీ పాలనలో పోలవరంను నిర్లక్ష్యం చేసిన పాపానికి దాదాపు 15 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టుగా తాజాగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రకటించారు. పనిలో పనిగా వచ్చే ఏడాదిలోపే డయాఫ్రంవాల్‌ నిర్మాణం, సమాంతరంగా ప్రధాన డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణానికి నిపుణులు ఓకే చేసినట్టుగా తీపి కబురు అందించారు. ఫలితంగా పనుల్లో జాప్యం లేకుండా తొలుత డయాఫ్రంవాల్‌ నిర్మాణంతో సహా కుడి, ఎడమ కాల్వల కనెక్టవిటిల కోసం 2026 వరకు పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రకటించారు. ఒక ప్రధాన డ్యాం నిర్మాణంలో పనుల పూర్తికి ఈ తరహా కార్యాచరణ ప్రకటిం చడం ఇదే ప్రఽథమం. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తికే కంకణం కట్టుకోవడం రైతువర్గాలకు ఓ వరంగా చెప్ప వచ్చు. పశ్చిమ డెల్టాకు ఈ ఏడాది కలసి వచ్చింది. అధిక వర్షాలకు పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. డ్రెయిన్లు పూడుకుపోయాయి. పూడిక తీయడానికి ఆగమేఘాలపై నిధు లు కేటాయించారు. సుమారు రూ.8 కోట్లు మంజూరు చేశారు. గుర్రపు డెక్క, తూడు తొలగించారు. పూడిక తీయించారు.

ఎత్తిపోతలకు ఇక మోక్షమే..

మెట్ట ప్రాంతానికి సాగు, తాగునీరు ఇవ్వడానికి ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్ల పాటు వదిలేశారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఇచ్చి కాగి తాల మీద లెక్కలు చూపించారు. తాడిపూడి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు గోదావరి జలాల తరలింపుకు వీలుగా టీడీపీ హయాంలో రూ.4,890 కోట్ల వ్యయంతో అప్పట్లో ప్రతిపాదనలు ఆమోదించారు. కాని గత ఐదేళ్లు ఇవేమీ వైసీపీ ప్రభుత్వానికి పట్ట లేదు. కనీసం రిజర్వాయర్ల నిర్మాణానికి అధి కారులు సమీక్షించలేక పో యారు. కూటమి ప్రభుత్వం వీటిపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చింతలపూడి ఎత్తి పోతల పథకాన్ని రెండు దశలుగా విభజించి మొదటి దశను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు 2 వేల 800 కోట్లు కేటాయించేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ మేరకు కేటా యింపులు చేసింది. జల్లేరు వద్ద జలాశయం నిర్మాణం పూర్తి చేసి తొలిదశలో పూర్తిస్థాయి నీరందించాలన్న సంకల్పానికి వచ్చారు. ఎర్రకాల్వ జలాశయం పరిధిలో కుడికాల్వ ఆధునికీకరణకు ఊత మిచ్చింది. తమ్మిలేరు జలాశయం అభివృద్ధి పను లకు ఓకే చేసింది. గతంలో నీరు–చెట్టు పథకం కింద ఇవ్వాల్సిన బకాయిలను తీర్చేం దుకు ప్రయత్నించింది. ఏడాది చివర్లో రైతులకు ఊత మిచ్చేలా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి..

కూటమి ప్రభుత్వం శభాష్‌ అనిపించుకుంది.

Updated Date - Dec 27 , 2024 | 01:24 AM