Share News

మద్యం షాపులు కళకళ.. బార్లు విలవిల!

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:06 AM

నూతన మద్యం పాలసీ అమ లులోకి వచ్చిన దరిమిలా బార్లకు కష్టాలు మొద లయ్యాయి.

మద్యం షాపులు కళకళ..    బార్లు విలవిల!

షాపులలోనే బ్రాండెడ్‌ మద్యం లభ్యం

బార్లకు తగ్గిన వ్యాపారం

మొన్నటి వరకు బార్లలో ధరల దరువు

ఇప్పుడు పోటీగా బ్రాందీ షాపులు

పాలకొల్లు/పాలకొల్లు రూరల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నూతన మద్యం పాలసీ అమ లులోకి వచ్చిన దరిమిలా బార్లకు కష్టాలు మొద లయ్యాయి. జగన్‌ రెడ్డి పాలనలో ప్రభుత్వ దుకా ణాలలో నాసిరకం మద్యమే లభించేది. దీంతో ధరలు ఎక్కువైనా బ్రాండెడ్‌ మద్యం తాగాలను కున్న మద్యపాన ప్రియులు బార్లను ఆశ్రయిం చేవారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనం తరం ఇప్పుడు ప్రైవేటు మద్యం షాపులలో అన్ని రకాల మద్యం బ్రాండులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో మద్యం కొనుగోలుదారులు బార్లు వైపు చూడటం మానేశారు.

జూ నూతన మద్యం పాలసీ అమలుకు ముందు బార్లలో క్వార్టర్‌ మద్యం బాటిల్‌పై గరిష్టంగా రూ.100, ఫుల్‌బాటిల్‌పై గరిష్టంగా రూ.500 అదనంగా అమ్మేవారు. ఇప్పుడు ప్రైవేటు మద్యం షాపులలో ఎమ్మార్పీకే మద్యం లభిస్తున్నది. వాస్తవంగా ప్రైవేటు షాపులకు ఎమ్మార్పీ కంటే 10.5శాతం తక్కువ ధరకు మద్యం వస్తుంది. ఎమ్మార్పీ ధరలు ఉల్లంఘించి అమ్మితే జరిమానా, షాపు లైసెన్స్‌ రద్దుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో ప్రైవేటు మద్యం షాపులలో ఎమ్మార్పీకే మద్యం అమ్ముతున్నారు.

జూ బార్లు విషయానికొస్తే ఎమ్మార్పీకి ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఎమ్మార్పీ ధరకు కొనుగోలు చేసి తమకు నచ్చిన రీతిలో అయా బార్లు సామర్ధ్యాన్ని బట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. మొన్నటి వరకు ఇలా అధిక ధరలకు అమ్మి బార్లు బాగా దండుకున్నాయి. అయితే ఊహించని రీతిలో ఇప్పుడు ప్రైవేటు మద్యం షాపులలో అన్ని రకాల బ్రాండుల మద్యం చల్లటి బీరు ఎంఆర్పీకే లభిస్తుండటంతో బార్ల ఆదాయానికి గండి పడింది. ఉమ్మడి జిల్లాలోని ఏలూరు నగరంతో సహా అన్ని పట్టణాలలో గల బార్లలో మద్యం నూతన పాలసీకి ముందు ఒక్కొక్క బీరు ఎమ్మార్పీకంటే రూ. 80నుంచి 100 అధికంగా అమ్మేవారు. ఇప్పుడు జిల్లాలో అధిక శాతం బార్లలో బీరులు ఎమ్మార్పీ కంటే రూ.20లు మాత్రమే అధికంగా అమ్ముతున్నారు. అయితే పాలకొల్లు, మరికొన్ని పట్టణాలలో అందినకాడికు దండుకునే ఉద్దేశంతో ఇంకా బీరులపై రూ.40 నుంచి80 అధిక ధరలకు అమ్ముతున్నారు.

బార్లకు బీర్లు?

ఈ ధరలను గమనిస్తే మద్యం షాపులు నుంచి కొన్ని రకాల బ్రాండ్‌ బీరులు బార్లకు అడ్డదారిలో వెళుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు మూడు రోజులుగా పలు బ్రాందీషాపులలో బీరులు లేవని చెబుతున్నారు. దీంతో మద్యపాన ప్రియులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మరలా దొడ్డిదారిన బారులకు వెళ్తుతున్నా యని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై నెలఖారు వరకు బారులకు లైసెన్స్‌లు ఉన్నాయి. అప్పటి వరకు అమ్మ కాలు ఎలా పెంచుకోవాలని బారుల యజ మానులు మల్లగుల్లాలు పడుతున్నారు. బారులకు నూతన మద్యం పాలసీలో ఎమ్మార్పీ కంటే తక్కువ ధరలకు ఇవ్వాలని పలు బారుల యజమానులు వ్యాఖ్యానిస్తు న్నారు. మొత్తంగా అన్ని రకాల మద్యం బ్రాండులు షాపులలో లభ్యం కావడంతో బారులు బేరమంటున్నాయి.

Updated Date - Nov 05 , 2024 | 12:06 AM