Share News

రుణ మాయ

ABN , Publish Date - Dec 09 , 2024 | 12:30 AM

తాడేపల్లిగూడెం బంధన్‌ బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇస్తామంటూ ఆశ చూపారు.

రుణ మాయ
పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఖాతాదారుల ఆందోళన (ఫైల్‌)

తాడేపల్లిగూడెం బంధన్‌ బ్యాంకు మాయాజాలం

ఖాతాదారులకు కొంత రుణం

మిగిలినది ఎవరి జేబులో..?

పోలీస్‌స్టేషన్‌కు చేరిన వివాదం

న్యాయం చేస్తామన్న బ్యాంకు అధికారులు

సర్దుతారా.. సర్దేస్తారా..!

తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం బంధన్‌ బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇస్తామంటూ ఆశ చూపారు. వద్దన్నవారికి వడ్డీ తక్కువ అంటూ ఎర వేశారు. ఏదొక అవసరానికి ఉపయోగపడ తాయని ఆశ పడ్డ ఖాతాదారులకు కనిష్ఠంగా రుణం ఇచ్చి గరిష్ఠ పరిమితిలో రుణ మొత్తం బ్యాంకు సిబ్బంది మాయం చేశారు. ఖాతాదారు లు చెల్లించిన నెల వాయిదాలు కూడా బ్యాంకు లో జమకాకపోవడంతో ఆరా తీసిన ఖాతాదారు లకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. వారి పేరు తో రుణాలు తీసుకుని బ్యాంకు అధికారులే కాజే స్తున్నారని బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. సాం కేతిక కారణం అంటూ కొన్నాళ్లు దాట వేశారు. చివరికి మేనేజర్‌ బదిలీకి ప్రయత్నించడంతో ఖాతాదారులు బ్యాంకులోనే ఉంచి తాళంవేసి నిర్బంధించడం విషయం వెలుగులోకి వచ్చింది.

అసలు మోసం ఇలా..

బ్యాంక్‌ ఖాతాదారు అవసరాలకు బ్యాంకు నుంచి గరిష్ఠ పరిమితిలో రూ.2 లక్షలు రుణం మంజూరు చేయవచ్చు. ఖాతాదారుకు కావాల్సిన మొత్తం రూ.30వేలు మాత్రమే తీసుకుంటే గరిష్ఠ మొత్తం రుణం ఇచ్చినట్టు చూపించి మిగిలిన సొమ్ము ఏంచేశారో తెలియని పరిస్థితి. రుణాలు తీసుకున్న వారు నెలవారీ వాయిదా చెల్లించినా రుణ ఖాతాలో జమ చేయకుండా దారి మళ్లిం చేశారు. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో దోచేశా రనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణంలో సుమారు రూ.80 లక్షల వరకూ స్వాహా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్గత ఆడిట్‌ చేస్తాం..?

ఖాతాదారుల ఆగ్రహంతో సమాచారం అందు కున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అక్కడ నుంచి సీన్‌ పోలీస్‌ స్టేషన్‌కు మారింది. తమను మోసం చేశారంటూ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విచారించగా ఇంట ర్నల్‌ ఆడిట్‌ చేసుకుని ఖాతాదారులకు న్యాయం చేస్తామంటూ బందన్‌ బ్యాంకు అధికారులు చెప్పడంతో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం బ్యాంకు అధికారులను హెచ్చరించి పంపారు. ఖాతాదారు లకు న్యాయం చేస్తారా నట్టేట ముంచుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 09 , 2024 | 12:30 AM