Share News

హర హర మహాదేవ

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:24 AM

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలు శివ నామ స్మరణతో హోరెత్తాయి.

హర హర మహాదేవ
పట్టిసీమ క్షేత్రానికి తరలివెళుతున్న భక్తులు

శివ నామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

పరమ శివుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఏలూరు కార్పొరేషన్‌, మార్చి 8: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలు శివ నామ స్మరణతో హోరెత్తాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. నగరంలోని శివాల యాల్లో స్వామివారికి అభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. మహాశివరాత్రి రోజు నే మాస శివరాత్రి కూడా కలిసి రావడం వలన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. సత్యనారాయణపేట గంగా పార్వతీ సమేత రేవులింగేశ్వరస్వామికి బడేటి చంటి, తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పవరుపేట కాశీ విశ్వేశ్వరస్వామికి నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, పెదబాబు దంపతులు పూజలు చేశారు. శివనగర్‌ భ్రమరాంబ సమేత మల్లికా ర్జునస్వామి, అంబికేశ్వరస్వామికి అంబికా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకు మార్చన చేశారు. దక్షిణపువీధి మార్కండేయస్వామి, జరాపహరేశ్వరస్వామి, అగ్రహారం నగరేశ్వరస్వామి, పాత శివాలయం, బావిశెట్టివారిపేట, నాగేశ్వర పురం శివాలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

ఏలూరు రూరల్‌: మాదేపల్లి శివాలయంలో స్వామిదర్శనం కోసం భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, రాత్రి లింగోద్భవ సమయంలో శివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తూర్పువీధి సాయిబాబా ఆలయం నుంచి సుమారు 10వేల మంది భక్తులు ద్వారకాతిరుమల తరలివెళ్లారు.

దెందులూరు: దక్షిణ కాశీగా పేరు పొందిన చల్లచింతలపూడి మేధా దక్షిణామూర్తి ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. శివునికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ, పూజలు చేశా రు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవర ణలో కోలాటం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు,

పోలవరం: పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్‌ డ్యాం సమీపంలో ప్రాచీన శివాలయం మహాఽనందీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఏకవార రుద్రాభిషేకం, లక్షపత్రి బిల్వార్చన, భస్మార్చన, అమ్మవారికి కుంకుమా ర్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం స్వామి వారి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొ న్నట్లు నిర్వాహకులు కోటంరాజు రాంబాబు తెలిపారు.

ఉంగుటూరు: మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా భీమేశ్వరాల యంలో శుక్రవారం నాడు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రెడ్డి సూర్యచం ద్రరావు ఆధ్వర్యంలో పుట్టపర్తి శివాలయం ప్రతిష్టించి పూజలు అభిషేకాలు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు దర్శించుకు న్నారు. మండలంలోని కైకరం, చేబ్రోలు, నారాయణపురం, కంసాలిగుంట, గొల్లగూడెం, బాదంపూడి, బొమ్మిడి, రాచూరు, నల్లమాడు(ఓంకారంపురం) శివాలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కైకరంలోని చిద్వేంకట రామ బ్రహ్మానంద మహర్షి వారి ప్రశాంత నిలయంలో పూజలు, కాల్వ గట్టున ఉన్న జల లింగేశ్వరాలయంలో కాల్వ గట్టున ఉన్న శివాలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. కైకరం కాల్వ గట్టున ఆరుగుళ్ల సెంటర్‌లో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేత కల్యాణం నిర్వహించారు.

లింగపాలెం: శివాలయాల్లో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించారు. మండలంలోని ఆసన్నగూడెం, ధర్మాజీగూడెం గ్రామాల్లోని శివాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాల్లో స్వామివారికి మొక్కులు చెల్లించిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కామవరపుకోట: మహాశివరాత్రి, మాస శివరాత్రి, శుక్రవారం కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాల వద్ద, అమ్మవారి ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలతో ఆరాధించారు. వీరభద్రస్వామి, లక్ష్మీ హయగ్రీవ లలితాపీఠం, ఆడమిల్లి శనీశ్వరాలయం, కంచికామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి, తడికలపూడి గంగా పార్వతీ సమేత గాంగేశ్వరస్వామి, జీలకర్రగూడెం ధర్మలింగేశ్వరస్వామి ఆలయాల వద్ద భక్తులు అభిషేకాలు, పూజలు చేశారు.

జంగారెడ్డిగూడెం టౌన్‌: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడువాయి భద్రకాళి సమేత వీరేశ్వస్వామి క్షేత్రం భక్తసంద్రమైంది. వేకువ జాము 5 గంటల నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హర హర మహాదేవా శంభో శంకర నామస్మరణతో భక్తులు తరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. తపన పౌండేషన్‌ ఆద్వర్యంలో కాసారపు నారాయణ, పాలా రామకృష్ణ, తదితరులు భక్తులకు మజ్జిగ, మంచినీటి పంపిణీ చేశారు. వేగవరం, లక్కవరం, పంగిడిగూడెంలో ఉన్న శివాలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

చింతలపూడి: మండలంలోని శివాలయాలు భక్తులతోకిటకిటలాడాయి. తెల్లవారుజామున 4 గంటలకే ఆలయాలను తెరిచి శివలింగ దర్శనం కల్పించా రు. అభిషేకాలు, అర్చనలు, పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చింతలపూడి వేగిలింగేశ్వరస్వామి ఆలయంలో మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. పలు గ్రామాల నుంచి భక్తులు కుటుంబాలతో వచ్చి దర్శించుకున్నారు. రేచర్ల, పోతునూరు, గురుభట్లగూడెం, ప్రగడవరంలలోని శివాలయాలు భక్తుల దర్శ నాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. చింతలపూడిలో రాత్రి శివ పార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.

పెదపాడు: హర హర మహాదేవ శంభో శంకర స్మరణతో శివాలయాలు హోరెత్తాయి. పెదపాడు గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి దేవాల యంలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామి వారికి విశేషాలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, ఉదయం నుంచి భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. శివయ్య యూ త్‌, ఆలయ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ చేశారు.

కుక్కునూరు: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పెదరావిగూడెంలోని ప్రముఖ శైవక్షేత్రం పార్వతి సమేత కేదారేశ్వర స్వామి, కౌడిన్యముక్తి లోని కౌండిన్యముక్తేశ్వర స్వామి, కుక్కునూరు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలకి భక్తులు తరలివచ్చారు. సమీప గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, రుద్రాభిషేకం, పూజలు చేశారు.

కుక్కునూరు మండలంలోని దాచారం గోదావరి తీరానికి ఆవల కుమార స్వామి ఆలయానికి శివరాత్రికి వందలాది మంది తరలివెళతారు. అధికారులు భద్రత పేరుతో గోదావరిలో పడవ నిలిపివేశారు. నిబంధనలతో అడ్డుకోవడం తగదని భక్తులు మధ్యాహ్నం వరకు భక్తులు వేచి చూసి వెనుదిరిగారు.

జీలుగుమిల్లి: మహా శివరాత్రి పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. జీలుగుమిల్లిలో నూతనంగా నిర్మించే శివాలయం వద్ద సామూహిక శివ లింగార్చన చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, శివపార్వతుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు వెంట బృందావన భజన మండలి కోలాట ప్రదర్శనలు జరిగాయి. కామయ్యపాలెం, లక్ష్మీపురం, అభయాంజనేయస్వామి సుబ్రమణ్యస్వామి, సాయిబాబా ఆలయా ల్లో పర్వదినం పురస్కరించుకుని శివార్చనలు చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 12:24 AM