Share News

11 నుంచి మావుళ్లమ్మ దర్శనం నిలిపివేత

ABN , Publish Date - Dec 09 , 2024 | 12:33 AM

మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి జరగనున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

11 నుంచి మావుళ్లమ్మ దర్శనం నిలిపివేత
దీపాలను వెలిగిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి జరగనున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11 నుంచి 25 వరకు అమ్మవారి మూల విరాట్‌ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌ బుద్ధా మహాలక్ష్మినగేష్‌ తెలిపారు. 11న ఉదయం 11 గంటలకు అమ్మవారి కళాపకర్షణ చేస్తారని, 24 వరకు ఉత్సవమూర్తికి నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. 25న ఉదయం విశేష పూజల అనంతరం అమ్మవారి కళలను విగ్రహంలో నిక్షిప్తం చేసి కుంభ, గో, దర్పణ దర్శనం కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు అమ్మవారి మూల విరాట్‌ దర్శనం కల్పిస్తామన్నారు.

పృథ్వీ శ్రీచక్రార్చన: మావుళ్లమ్మ ఆలయంలో ఆదివారం పృథ్వీ శ్రీ చక్రార్చన పూజ నిర్వహించారు. హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌కు చెందిన నవగోపికా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ చదలవాడ నాగరాణి దీపాలను వెలిగించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు కలెక్టర్‌ నాగరాణికి ఆశీర్వచనం అందజేశారు.

Updated Date - Dec 09 , 2024 | 12:33 AM