మిల్లర్లకు బకాయి రూ.200 కోట్లు
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:33 PM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమపై ఆశలు చిగురిస్తున్నాయి. బకాయిలు విడుదల చేస్తారంటూ మిల్లర్లు ఎదురు చూస్తున్నారు.
మూడేళ్లుగా పెండింగ్
పట్టించుకోని గత ప్రభుత్వం
కూటమి రాకతో ఆశలు
(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమపై ఆశలు చిగురిస్తున్నాయి. బకాయిలు విడుదల చేస్తారంటూ మిల్లర్లు ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. గత ఆరు సీజన్‌ల నుంచి చార్జీలు చెల్లించలేదు. రైతులకు అదే దుస్థితి ఎదు రైంది. సకాలంలో ధాన్యం సొమ్ములు చెల్లించకుండా గత ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. ధాన్యం కొనుగోలుపైనా లెక్కకు మిక్కిలి ఆంక్షలు విధించింది. కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటి తొలగిస్తున్నారు. రైతులు ధాన్యం అమ్ముకునే విధా నాన్ని సులభ తరం చేశారు. అనుకున్నట్టుగానే ధాన్యం అమ్మకాలు సాగించిన 48 గంటల వ్యవధిలో సొమ్ములు జమ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలో మసూళ్లు ప్రారంభమ య్యాయి. మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయి. ధాన్యం అమ్మకాలు అంతే వేగంగా జరుగుతున్నాయి, రైతులకు సొమ్ములు జమ అయిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి బాగుంది. మిల్లును ఎంపిక చేసుకునే హక్కును రైతుకు కల్పించారు. దానివల్ల రైతు ముందుగా సంచులు తెచ్చుకుంటున్నారు. తూకం వేసుకుంటున్నారు. అమ్ముకుంటు న్నారు. రోజుల తరబడి రోడ్డుపై ధాన్యం రాశులు పోసి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోతోంది. ప్రైవేటుగానూ పోటీ నెలకొంది. వర్తకులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలా రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. అదే తరహాలో మిల్లర్లకు బిల్లులు చెల్లించాలన్న డిమాండ్ వినిపి స్తోంది. అదే జరిగితే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రైవేటు వర్తకుల మధ్య పోటీ పెరిగి రైతులకు అధిక ధరలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే బిల్లులకు తాత్సారం చేసిందో మిల్లర్లు చేతులెత్తేశారు. కేవలం ప్రభుత్వం కొనుగోళ్లపైనే ఆధారపడుతు న్నారు.
బ్యాంకు గ్యారెంటీల భారం
ప్రభుత్వం నుంచి సక్రమంగా బిల్లులు విడుదల కావడం లేదు. మిల్లింగ్, డ్రయ్యర్, బియ్యం రవాణా, కస్టోడియన్, సంచుల వినియోగ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించాలి. జిల్లాలో వైసీపీ హయాంలోనే రూ. 200 కోట్ల మేర బకాయిలున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేసింది. ఫలితంగా బ్యాంకు గ్యారంటీలు చెల్లించడానికి మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆస్తులు తాకట్టు పెడుతు న్నారు. గ్యారంటీలో 15శాతం సొమ్ము జమ చేస్తున్నారు. బ్యాంకులకు ఒక్క శాతం రుసుము చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా బ్యాంకు గ్యారెంటీల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.
విదేశీ వర్తకం కనుమరుగు
పశ్చిమగోదావరి నుంచి గతంలో విదేశాలకు బియ్యం ఎగుమతి అయ్యేవి. రబీలో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. మిల్లర్లు ప్రైవేటుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసుకునేవారు. ప్రభుత్వం నుంచి పోత్సాహకాలు ఉండేవి. క్రమేణా జిల్లాలో బియ్యాన్ని విదేశా లకు ఎగుమతి చేసే వర్తకులు కనుమరగయ్యారు. మిల్లర్లు సైతం ప్రైవేటుగా బియ్యం అమ్మలేకపోతున్నారు. గిట్టుబాటు కావడంలేదన్న ఉద్దేశంతో వెనుకంజ వేస్తున్నారు. జిల్లానుంచి రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. లబ్ధిదా రుల వద్ద కొనుగోలు చేసి కాకినాడ పోర్టుకు రవాణా చేస్తు న్నారు. అక్కడ నుంచి విదేశాలకు తరలిపోతున్నాయి. రేషన్ బియ్యంలో దాదాపు 60శాతం ఇలా విదేశాలకు వెళ్లిపోతున్నా యి. దాంతో మిల్లర్ల నుంచి కొనుగోలు చేయడానికి విదేశీ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడంతా ప్రభుత్వం ధాన్యంకొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగిస్తోంది. తిరిగి బియ్యం తీసుకుంటోంది. అయితే మిల్లర్లకు ఎప్పటికప్పుడు రవాణా చార్జీలు చెల్లించాలి. అది నెరవేర్చడం లేదు. ఎఫ్‌సీఐకి ప్రభుత్వమే బియ్యం అప్పగిస్తుంది. మిల్లర్ల నుంచి బియ్యం సేకరించి ఎఫ్‌సీఐకి తరలిస్తుంది. రవాణా ఛార్జీలతో సహా బియ్యం బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ జమ చేస్తోంది. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌరసరఫరాల కార్పొరేషన్‌కు జమ అవుతున్నాయి.
అప్పుల పాలైన కార్పొరేషన్
గత ప్రభుత్వంలో పౌరసరఫరాల కార్పొరేషన్ పూర్తిగా అప్పుల పాలైంది. ఒకప్పుడు నిధులు పుష్కలంగా ఉండేవి. ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేసేవి. ప్రస్తుతం రేషన్ బియ్యం సరఫరా చేసే కాంట్రాక్టర్‌లకు కూడా సకాలంలో సక్రమంగా బిల్లులు చెల్లించలేని దుస్థితికి కార్పొ రేషన్‌కు చేరుకుంది. నిధులు మళ్లించడంతో కార్పొ రేషన్‌కు కష్టకాలం ఎదురైంది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. రైతులకు సకాల ంలో సొమ్ములు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకు ంది. ఆ హామీని నెరవేరుస్తోంది. రైతులు ధాన్యం విక్రయించే ఇబ్బందులను పరిష్కరించింది. మిల ్లర్లకు కూడా అదే తరహాలో బకాయి లు విడుదల చేస్తే రైతులకు అంతిమంగా మేలు చేకూరనుంది.