సంక్రాంతికి మినీ గోకులం
ABN , Publish Date - Dec 09 , 2024 | 12:24 AM
పాడిరైతులకు ప్రభుత్వపెద్దపీట వేస్తోంది.
జిల్లాకు 900 యూనిట్లు మంజూరు
850 ప్రారంభం
నెల రోజుల్లో మిగిలినవి పూర్తి చేయడానికి కసరత్తు
భీమవరం టౌన్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పాడిరైతులకు ప్రభుత్వపెద్దపీట వేస్తోంది. పశుసంపదకు పూర్వ వైభవం తీసుకురావాలని చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో సంక్రాంతి నాటికి మినీ గోకులాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అర్హులైన రైతుల నుంచి పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణలో అన్ని గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిం చారు. జిల్లాకు 900 మినీ గోకులాలు మంజూరు కాగా ప్రస్తుతం 850 ప్రారంభ దశలో ఉన్నాయి. వాటిలో 15 మినీ గోకులాలు పూర్తి అయ్యాయి. మినీ గోకులాలు 2, 4, 6 పశువులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించారు. ఇందుకోసం రూ.14.9 కోట్లు మంజూరయ్యాయి. రెండు పశువులతో షెడ్డు వేసుకుంటే రూ.లక్ష మంజూరు చేస్తారు. రైతు వాటా రూ.11,500 చెల్లిస్తే మిగతా సొమ్ము ప్రభుత్వం అందిస్తుంది. 4 పశువులకు రూ.1.85 లక్షలు కాగా 90 శాతం రుణం, 10 శాతం రైతు వాటా. 6 పశువులకు రూ.2.3 లక్షలు కాగా రూ.23 వేలు రైతు వాటా. అదే విధంగా మేకలు, గొర్రెలు పెంపకందారులకు కూడా ఇదే విధంగా రుణాలు మంజూరకు అవకాశం ఉంది.
సంక్రాంతి నాటికి పూర్తి కావాలి
మినీ గోకులాలు సంక్రాంతికి నాటికి పూర్తి కావాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రుణాలు మంజూరైన రైతులను సంక్రాతికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పాడి అభివృద్ధికి దోహదం
గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద పెంచడంతోపాటు పాల ఉత్పత్తిని పెంచే దిశగా గోకులాలను మంజూరుచేస్తున్నారు. దరఖాస్తుదారులు నింబధనలకు అనుగుణంగా చేసుకుంటే వాటిని పశుసంవర్ధక శాఖ ఆమోదం అనంతరం డ్వామా ద్వారా నిఽధులు మంజూరు చేస్తారు. మినీ గోకులాలను డ్వామా పీడీ అప్పారావు పరిశీలి స్తున్నారు. మినీ గోకులాలు పూర్తిస్ధాయిలో త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
పశువుల మేతకు రుణం
పశువులకు గడ్డి కోసం రుణాలు మంజూరు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 50 సెంట్లవరకు స్థలం ఉన్నరైతులకు పచ్చగడ్డి పెంచుకునేందుకు రూ.10 వేలు తగ్గకుండా రుణం ఇస్తున్నారు. 10 సెంట్లు ఉంటే గడ్డి మొక్కలు కొనుగోలుకు రూ.5వేలు ఇస్తారు. అంతే కాకుండా ఉపాధి హామీ పథకంలో సెంట్లను బట్టి రోజులను లెక్కించి వారికి రూ.300 చొప్పున కూలీ ఇచ్చే అవకాశం ఉంది. ఆసక్తి గల రైతులు సప్రందింవచ్చని డ్వామా పీడీ అప్పారావు తెలిపారు.