Share News

పోలింగ్‌కు సిద్ధం

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:26 AM

ఎన్నికల బరిలో బొర్రా గోపిమూర్తి (భీమవరం), గంధం నారాయణరావు(ద్రాక్షారామం), నామన వెంకట లక్ష్మి(సామర్లకోట), కవల నాగేశ్వరరావు (రాజమహేంద్రవరం), పులుగు దీపక్‌ (తాడేపల్లిగూడెం) తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.

పోలింగ్‌కు సిద్ధం
భీమవరం నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకునివెళుతున్న పోలింగ్‌ కేంద్రానికి వెళుతున్న సిబ్బంది

ఎన్నికల బరిలో బొర్రా గోపిమూర్తి (భీమవరం), గంధం నారాయణరావు(ద్రాక్షారామం), నామన వెంకట లక్ష్మి(సామర్లకోట), కవల నాగేశ్వరరావు (రాజమహేంద్రవరం), పులుగు దీపక్‌ (తాడేపల్లిగూడెం) తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌

జిల్లాలో కేంద్రాలు 20.. బరిలో ఐదుగురు అభ్యర్థులు

ఓటర్లు 3,729 మంది.. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఆర్డీవో కార్యాలయాల నుంచి పోలింగ్‌ సామగ్రి, సిబ్బందికి తరలింపు

ఉపాధ్యాయులకు నేడు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌

భీమవరం టౌన్‌, డిసెంబరు 4(ఆంరఽఽదజ్యోతి):ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేడు జరగనుంది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. జిల్లాలోని నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డీవోల పర్యవేక్షణలో బుధవారం పోలింగ్‌ సిబ్బంది, మెటీరియల్‌ను ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. గురువారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్‌ సామగ్రి భీమవరం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మధ్యంతర రిసెప్షన్‌ కేంద్రానికి తరలించి, అదేరోజు రాత్రి బ్యాలెట్‌ బాక్సు, ఇతర పత్రాలను అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తారు. సహాయ రిటర్నింగ్‌ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి ఉభయ గోదా వరి జిల్లాల్లో మొత్తం ఓటర్లు 16,737 మంది. పోలింగ్‌ కేంద్రాలు 116. బ్యాలెట్‌ బాక్సులను జేఎన్‌టీయూకేలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తారు. 9న కౌంటింగ్‌ జరుగుతుంది.

20 పోలింగ్‌ కేంద్రాలు

ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 20 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 26 మంది పీవోలు, 78 మంది ఏపీవోలు, 26 మంది మైక్రో అబ్జర్వర్లు, 20 మంది రూట్‌ ఆఫీసర్లు, జోనల్‌ ఆఫీసర్స్‌గా ముగ్గురు ఆర్టీవోలు పర్యవేక్షిస్తారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్టేషన్‌ వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. మొత్తం ఓటర్ల సంఖ్య మూడు వేల 729 మంది. వీరిలో పురుషులు 2,268 మంది, మహిళలు 1,461 మంది. భీమవరం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ మెటీరియల్‌ తరలింపును, సిబ్బంది, ఇతర అనుబంధ విధులను

ఆర్డీవోలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, ఖతీబ్‌ కౌసర్‌ భానో, అర్బన్‌ తహసిల్దార్లు, ఇంచార్జి ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ మర్రాపు సన్యాసిరావు, ఎన్నికల డ్యూటీలు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి పంపిణీపై జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పర్యవేక్షించారు. ఆర్డీవోల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం తో ఐదో తేదీన స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్వో తెలిపారు.

జేసీ ఏర్పాట్ల పరిశీలన

ఎమ్మెల్సీ పోలీంగ్‌కు సంబంధించి పోడూరు జడ్పీ హైస్కూల్‌ను జేసీ రాహుల్‌ కుమార్‌రెడ్డి పరిశీలించారు. పోలింగ్‌ ఏర్పాట్ల పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు.

20 పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు

అత్తిలి ప్రజా పరిషత్‌ అప్పర్‌ ప్రైమరీ బాలుర పాఠశాల 90

ఆకివీడు ఎస్‌ఎస్‌ఎన్‌ జడ్పీ బాలికల హైస్కూల్‌ 63

ఆచంట ఎంవీఆర్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ 63

భీమవరం అర్బన్‌ ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్‌ 759

గణపవరం సీహెచ్‌బీఆర్‌ జడ్పీ బాలుర హైస్కూల్‌ 66

ఇరగవరం జడ్పీ హైస్కూల్‌ 53

కాళ్ల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల మెయిన్‌ 52

మొగల్తూరు పెనుమత్స రంగరాజు జడ్పీ హైస్కూల్‌ 58

నరసాపురం మునిసిపల్‌ యూపీ బాలికల పాఠశాల 425

పెంటపాడు గవర్నమెంట్‌ పోస్టు బేసిక్‌ స్కూల్‌ 73

పోడూరు డీఎస్‌ రాజు జడ్పీ హైస్కూల్‌ 71

పాలకోడేరు జడ్పీ హైస్కూల్‌ 102

పెనుమంట్ర భవిత ఎడ్యుకేషనల్‌ రీసోర్స్‌ సెంటర్‌ 85

పెనుగొండ ఎంపీడీవో కార్యాలయం మీటింగ్‌ హాల్‌ 156

పాలకొల్లు బీవీఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూల్‌ 28వ వార్డు 480

తాడేపల్లిగూడెం మునిసిపల్‌ హైస్కూల్‌ 377

తణుకు జాస్తి సీతామహాలక్ష్మి బాలికల హైస్కూల్‌ 407

ఉండి జడ్పీ హైస్కూల్‌ 69

వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ హైస్కూల్‌ 129

యలమంచిలి మండల ప్రజా పరిషత్‌ ప్రైమరీ స్కూల్‌ 94

Updated Date - Dec 05 , 2024 | 12:26 AM