Share News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారా ?

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:29 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మీరు ఓటు హక్కు నమోదు చేసుకోలేదా ? అయితే ఈ రోజే నమోదు చేసు కోండి. బుధవారంతో గడువు ముగుస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారా ?

నేటితో గడువు ముగింపు.. జిల్లాలో ఇప్పటికి 43 వేల 097 ఓటర్ల నమోదు

ఙరేపటి నుంచి దరఖాస్తుల పరిశీలన

భీమవరం టౌన్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మీరు ఓటు హక్కు నమోదు చేసుకోలేదా ? అయితే ఈ రోజే నమోదు చేసు కోండి. బుధవారంతో గడువు ముగుస్తోంది. ఓటర్లనమోదును రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నమోదు ప్రక్రియ వేగవంతంగా మారింది. మంగళవారానికి జిల్లాలో 43 వేల 97 మంది తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నా రు. వీరిలో ఆన్‌లైన్‌ ద్వారా 29 వేల 231 మంది, ఆఫ్‌లైన్‌ ద్వారా 13 వేల 866 మంది ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటు నమోదుకు ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులు. గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతోపాటు జత చేయాలి. ఈ దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ నుంచి పరిశీలిస్తారు. బీఎల్‌వోలు వచ్చినప్పుడు డిగ్రీ ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ చూపించాలి. డ్రాప్ట్‌ ఓటర్ల లిస్టును 23న విడుదల చేస్తారు. తొమ్మిది వరకు అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే నెల 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.

11న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌

భీమవరం టౌన్‌/కాకినాడ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 11న నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు. నామినేషన్ల దాఖలుకు 18 చివరి తేదీ. 19న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు 21. వచ్చే నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

కాకినాడ కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ను నియమించారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆరు జిల్లాల నుంచి నామినేషన్ల దాఖలుకు కాకినాడ కలెక్టరేట్‌కు రావాలి. అసిస్టెంట్‌ ఎన్నికల రిట్న రింగ్‌ అఽధికారులుగా కాకినాడ డీఆర్వో జె.వెంకట రావు, తూర్పుగోదావరి జిల్లా డీఆర్వో సీతారా మ్మూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో వి.మదన్‌ మో హన్‌, పశ్చిమ గోదావరి జిల్లా డీఆర్వో ఎం.వెంకటే శ్వర్లు, ఏలూరు డీఆర్వో వి.విశ్వేశ్వరరావులను నియమించారు. వీరు ఎన్నికల ఏర్పాట్లను పర్య వేక్షిస్తున్నారు. ఆరు జిల్లాల్లో 116 పోలింగ్‌ కేంద్రా లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో అల్లూరి సీతా రామరాజు జిల్లాలో 12 కేంద్రాలు, తూర్పుగోదావ రిలో 20, ఏలూరు జిల్లాలో 20, కాకినాడ జిల్లాలో 22, కోనసీమ జిల్లాలో 12, పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాల వారీగా ఓటర్లు..

మొత్తం 16,316 మంది ఓటర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 614 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 2893, ఏలూరు జిల్లాలో 2605, కాకినాడ జిల్లాలో 3333, కోనసీమ జిల్లాలో 3209, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,662 ఓటర్లు ఉన్నారు.

టీచర్స్‌ ఎమ్మెల్సీకి సంబంధించి నియోజకవ ర్గాల పరిధిని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాకినాడ, డాక్డర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, భీమ డోలు, నిడమర్రు, గణపవరం, పెదవేణి, పెద పాడు, దెందులూరు, ద్వారకా తిరుమల, పోలవ రం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూ డెం, టి.నర్సాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం,కామవరపుపేట, జంగా రెడ్డిగూడెం మండలాలు ఉన్నాయి. అల్లూరి జిల్లా లోని రంపచోడవరం, ఏజెన్సీ గంగవరం, అడ్డతీగ ల, వై.రామవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, చింతూరు, వరరామచంద్రపురం, ఎటపాక, కూనవరం మండలాలుగా నిర్ణయిం చింది.

మండలాల వారీగా ఓట్ల నమోదు

మండలం మొత్తం ఆఫ్‌లైన్‌ ఆన్‌లైన్‌

భీమవరం 5,770 2087 3683

తణుకు 6,244 3,652 2,592

తాడేపల్లిగూడెం 3,301 734 2,567

నరసాపురం 3,323 1,168 2,155

పాలకొల్లు 6,012 1012 5,000

ఆకివీడు 1,540 320 1,220

వీరవాసరం 1,164 237 927

పాలకోడేరు 1,028 350 678

పెనుగొండ 1,370 476 894

అత్తిలి 1,763 1,126 637

పెంటపాడు 941 188 753

మొగల్తూరు 833 175 658

గణపవరం 831 180 651

పెనుమంట్ర 1,154 460 694

ఉండి 756 181 575

కాళ్ళ 774 168 606

ఆచంట 1,382 273 1,109

పోడూరు 1,480 111 1,369

ఇరగవరం 1,452 906 546

యలమంచిలి 1,979 62 1917

మొత్తం 43,097 13,866 29,231

Updated Date - Nov 06 , 2024 | 12:30 AM