Share News

అమ్మో.. హాస్టల్‌

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:14 AM

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉన్నవారు వెళ్లిపోయారు. కొత్తవారు చేరలేదు. ఫలితంగా ముదినేపల్లిలోని షెడ్యూల్డు కులాల కళాశాల స్థాయి బాలురు, బాలికల వసతిగృహాలు మూతపడ్డాయి.

అమ్మో.. హాస్టల్‌
ముదినేపల్లిలో మూతపడిన ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహం

భవనాలు శిథిలం

సౌకర్యాలు లేవు

విద్యార్థులు ఉండలేరు

ముదినేపల్లి హాస్టల్‌ మూత

ముదినేపల్లి, నవంబరు 3: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉన్నవారు వెళ్లిపోయారు. కొత్తవారు చేరలేదు. ఫలితంగా ముదినేపల్లిలోని షెడ్యూల్డు కులాల కళాశాల స్థాయి బాలురు, బాలికల వసతిగృహాలు మూతపడ్డాయి. గత ఏడాది వరకు ఈ వసతిగృహాల్లో అరకొర సౌకర్యాలతో సరిపెట్టుకున్న విద్యార్థులు ఈ ఏడాది ఉండలేక వేరేచోటుకు వెళ్లిపోయారు. ముదినేపల్లిలోని పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు గుడివాడలో ప్రైవేట్‌ రూముల్లో అద్దెకు ఉంటున్నారు. గతంలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 40 మంది విద్యార్థులున్న వసతి గృహంలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు స్వగ్రామాలకు దగ్గర్లోని ప్రభుత్వ వసతిగృహాల్లో చేరిపోయారు. ఐదేళ్ల క్రితం ఈ వసతిగృహం కళాశాల హాస్టల్‌గా మారింది. సుమారు 20 మంది విద్యార్థులు చేరారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో 2023–24లో ఐదుగురు విద్యార్థులు మిగిలారు. ప్రస్తుతం వారు కూడా వెళ్లిపో యారు.. కొత్తవారు చేరలేదు. మూతబడింది. ముదినేపల్లిలోని ఎస్సీ కళాశాల బాలికల వస తిగృహ భవనం పదేళ్లుగా శిథిలావస్థలో ఉన్నా పట్టించుకున్న వారు లేరు. గతంలో 80 మంది విద్యార్థినులు ఉండగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. వారు కూడా వసతిగృహంలో భోజనం చేసి రాత్రి ప్రైవేట్‌ భవనంలో ఉండాల్సిందే.

Updated Date - Nov 04 , 2024 | 12:14 AM