Share News

మైనర్‌ బాలికకు యువకుడి వేధింపులు

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:11 AM

తల్లి మరణించడంతో తన ముగ్గురు ఆడ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఉన్నకాడికి తాపీపనులు చేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు.

మైనర్‌ బాలికకు యువకుడి వేధింపులు

హెచ్చరించిన తండ్రి

కక్షగట్టిన యువకుడు

బాలిక తండ్రితో గొడవపడి కత్తితో పొడిచి హత్య

ఏలూరు క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తల్లి మరణించడంతో తన ముగ్గురు ఆడ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఉన్నకాడికి తాపీపనులు చేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను పెద్దవారిని చేసి మంచి సంబం ధాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆ ముగ్గురు పిల్లలు కూడా 12 సంవత్సరాలలోపు వారే. అంతలోనే ఒక ఆకతాయి పెద్ద కుమార్తె వెంట పడ్డాడు. ఇది మంచి పద్ధతి కాదని ఆ తండ్రి మందలించాడు. అయినప్పటికి కూడా తన వేధింపులు ఎక్కువ కావడంతో తన కుమా ర్తెను రక్షించుకోవాలని ఆ తండ్రి ముగ్గురు పిల్లల ను తీసుకుని మరో ఊరు వెళ్ళి జీవిస్తున్నాడు. పనిమీద ఏలూరు వచ్చిన అతనిని కక్ష పెంచు కుని ఉన్న ఆ ఆకతాయి ఏకంగా ఆతండ్రిని కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ సంఘటన ఏలూరు నగరంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. ఏలూరు త్రి టౌన్‌ సీఐ ఎస్‌ఐ కోటేశ్వ రరావు తెలిపిన వివరాల ప్రకారం. ఏలూరు ఓవర్‌ బ్రిడ్జి కింద 39వ పిల్లర్‌ వద్ద నివాసం ఉంటున్న షేక్‌ వెంకట కనకరాజు (45)కు భార్య నాగమణి ఎనిమిది సంవత్సరాల క్రితం మరణిం చింది. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు ఆటో నడిపేవాడు. ఏలూరు రూరల్‌ మండలం వెంకటాపురానికి చెందిన నాని అనే యువకుడు తరచుగా ఓవర్‌ బ్రిడ్జి కిందకు వచ్చి కనకరాజు పెద్ద కుమార్తె (12)ను వేధిం చేవాడు. తనకు ఇచ్చి పెళ్ళి చేయాలని లేదంటే ఎవరినో ఒకరిని చంపివేస్తానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో కనకరాజుకు, నానికి గొడవలు జరిగేవి. ఈ నేపధ్యంలో తమ పిల్లలను కాపాడుకోవడానికి ఆ ముగ్గురు పిల్లలను తీసు కుని ఉంగుటూరు మండలం నారాయణపురం వెళ్ళి అక్కడే ఉంటూ తాపీ పనులకు వెళ్తున్నాడు. ఈనెల 13వ తేదీ ఉదయం 39వ పిల్లర్‌ వద్ద అతను నివాసం ఉన్న నాగిరెడ్డి గం గలక్ష్మి ఇంటి వద్దకు వచ్చి ఉన్నాడు. తిరిగి సాయ ంత్రం వరకూ అక్కడే పడుకుని రాత్రి కూడా ఆ ఇంటి బయటే పడుకుని ఉన్నాడు. కనకరాజు వచ్చిన సంగతి నాని తెలుసుకుని శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలోనే సంచరించి కనకరాజు ఎక్కడ ఉన్నాడంటూ కొంతమందిని అడిగినట్లు చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున కనక రాజుతో నాని గొడవ పెట్టుకుని అతని కుమార్తెను ఇచ్చి పెళ్ళిచేయాలని బెదిరింపులకు పాల్పడి చివరకు కత్తితో పొడిచి హతమార్చి పరారీ అయ్యాడు. శనివారం ఉదయం ఈ సంఘటనపై ఆ ప్రాంత గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శి (మహిళ పోలీస్‌) సిరిమళ్ళ నాగ దుర్గాభవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రి టౌన్‌ సీఐ ఎస్‌ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మరోవైపు నాని కోసం ప్రత్యేక బృందాలను గాలింపుల్లోకి దించారు. ఆదివారం శవపంచనా మా నిర్వహించి పోస్టు మార్టం నిర్వహించ నున్నారు. కనకరాజు బంధువులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - Dec 15 , 2024 | 12:11 AM