Share News

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:10 AM

భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహరంలోని మార్కెట్‌ యార్డులో ఉన్న పుట్టల వద్దకు మహిళలు చేరుకుని పాలు పోసుకుని చనివిడి, చిమిలి, అరటిపండ్లు, కోడిగుడ్లు, తదితర వాటిని నివేదన చేశారు. పుట్టవద్ద మొక్కులు తీర్చుకున్నారు.

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
మొగల్తూరు నాగదేవత ఆలయంలో పూజలు

పుట్టల వద్ద భక్తుల ప్రత్యేక పూజలు

కిటకిటలాడిన శివాలయాలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు

భీమవరంటౌన్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి) : భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహరంలోని మార్కెట్‌ యార్డులో ఉన్న పుట్టల వద్దకు మహిళలు చేరుకుని పాలు పోసుకుని చనివిడి, చిమిలి, అరటిపండ్లు, కోడిగుడ్లు, తదితర వాటిని నివేదన చేశారు. పుట్టవద్ద మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలో ఉన్న నాగేంద్రస్వామివారి ఆలయంలోని నాగ సర్పాలకు పాలు పోసుకుని భక్తిని చాటుకున్నారు. భీమేశ్వరస్వామి దేవస్థానంలోని సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలోను, సోమేశ్వరస్వామి ఆలయంలో ఉప ఆలయంగా సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయాల్లోను భక్తులు పాలు పోసి పూజలు చేసుకున్నారు.

పాలకొల్లు అర్బన్‌, /పాలకొల్లు రూరల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నాగుల చవితి సందర్భంగా పట్టణంలోనూ, మండలంలోని పలు గ్రామాల్లో వున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల యాల వద్ద మంగళవారం భక్తులు ఆవుపాలతో అభిషేకాలు చేశారు. కొందరు తమ చిన్నారులకు పుట్టల వద్ద తలపై నుంచి బూర్లు పోసి మొక్కులు తీర్చుకుని, పుట్ట మన్నును చెవులకు, కళ్ళకు రాసుకున్నారు.

నరసాపురం టౌన్‌/మొగల్తూరు : నరసాపురం పట్టణ, మండలంలో నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు జరుపుకున్నారు. శివాల యం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలతో పాటు ఇరిగేషన్‌ కార్యాలయం సమీపంలో ఉన్న పుట్ట వద్ద భక్తులు పాలు పోసి, పూజలు చేశారు. మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో వు న్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు, నాగు పుట్టల వద్ద భక్తులు పాలు పోసి, కోడిగుడ్లు, చనివిడి, చిమిలి, అరటిపండ్లు, తేగలతో పూజలు చేశారు.

ఆకివీడు/కాళ్ల/పాలకోడేరు : నాగుల చవితి సందర్భంగా ఆకివీడులోని శివాలయాలు, సుబ్ర హ్మణ్యస్వామి, నాగేంద్రస్వామి దేవాలయాల్లో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పుట్టల వద్దకు భక్తులు వెళ్లి పాలు పోసి, కోడి గుడ్లు వేశారు. కాళ్ల మండలంలో కాళ్ళ, కోలనపల్లి, బొండాడ, జక్కరం, కాళ్ళకూరు, ఏలూరుపాడు, జువ్వలపాలెం తదితర గ్రామాల్లో భక్తులు పుట్టల వద్దకు చేరుకుని పాలు పోసి, పూజలు చేశారు. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం లోని నాగుల చెరువుగట్టుపై ఉన్న నాగులపుట్ట వద్ద భక్తులు పుట్టలో పాలుపోసి పూజలు చేసిన అనంతరం బాణసంచా కాల్చి సందడి చేశారు.

ఆచంట/పెనుమంట్ర:ఆచంట మండలం లోని పలు గ్రామాల్లో నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా పుట్టలు వద్ద భక్తులు పెద్దఎత్తున పూజలు చేశారు. పెను మంట్ర మండలం జుత్తిగ ఉమావాసుకి రవి సోమేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక రుద్రా భిషేకాలు, పార్వతీదేవి అమ్మవారికి కుంకుమా ర్చనలు, ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. టీటీడీ వేద పండితులు వేమూరి ఫణీంద్రశర్మ, అర్చకులు రామకృష్ణశర్మ, వాసు శర్మ, గణేష్‌ శర్మ పాల్గొన్నారు.

గణపవరం : ఎ.గోపవరంలో తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయ ప్రాంగణంలో కొలువుతీరిన పుట్టకు పూజలు చేశారు. పుట్టలో పాలు, కోడిగుడ్లు వేశారు. పచ్చితేగ ముక్కలు, బుర్రగుం జు, చలిమిడి, వడపప్పు, చిమ్లి, ఆవులపాలు, ప్రసాదాలను పుట్టవద్ద పెట్టారు. ఆలయం వద్ద పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

తణుకు/అత్తిలి :నాగుల చవితి సందర్భంగా పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామి వారిని దర్శించుకుని పుట్టలో పాలు పోసారు. జాతీయ రహదారి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కూడా భక్తులు పొటెత్తారు. అత్తిలిలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. మంచిలికి చెందిన భగవాన్‌ పూతరేకుల నిర్వాహకుడు సిరగాని నాగేశ్వరరావు దంపతులు ప్రసాద వితరణ చేశారు. అత్తిలి బస్టాండ్‌ సమీపంలో గల నాగమ్మ ఆలయ ఉత్సవాలు నిర్వహించారు. అత్తిలి పాలూరు డ్యాం రోడ్డులో గల గంటా వారి పుంతలో కొండలరాయుడును భక్తులు దర్శించుకున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌/పెంటపాడు : నాగుల చవితి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో భక్తు లు నాగమ్మకు పూజలు చేశారు. చేల గట్ల వెం బడి ఉన్న పుట్టల్లో పాలు, గుడ్లు వేసి నైవేద్యం అందించారు. పట్టణంలోని గణేష్‌ నగర్‌, గొల్లగూడెం, పాతూరు ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. పెంట పాడు మండలం పడమరవిప్పర్రులో సు బ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటె త్తారు. దాతలు స్వామి వారి అన్నసమారా ధనకు వినియోగించే సుమారు రూ. 58 వేలు విలువ చేసిన వడ్డింపు సామగ్రిని అందజేశారు. భారీ అన్నసమారాధన జరిగింది. మాజీ ఎమ్మె ల్యే పసల కనకసుందర్రావు, మాజీ సర్పంచ్‌ పసల చంటి, సొసైటీ మాజీ అధ్యక్షుడు పసల అచ్యుతం, పసల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Nov 06 , 2024 | 12:10 AM