2 గంటల చార్జింగ్ ...20 కిలోమీటర్లు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:29 AM
ఈ బైక్‌కు రెండు గంటలకు చార్జింగ్ పెడితే 18–20 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్ల వరకూ సులభంగా ప్రయాణం చేయవచ్చు.
విద్యుత్ బైక్ తయారు చేసిన
ఏపీ నిట్ విద్యార్థులు
‘ఈ బైక్‌కు రెండు గంటలకు చార్జింగ్ పెడితే 18–20 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్ల వరకూ సులభంగా ప్రయాణం చేయవచ్చు. 150 నుంచి 200 కిలోల వరకు బరువును మోస్తుంది. అంతే కాదు.. ఈ బైక్‌ను మడత పెట్టి సూట్‌కేసులా కారులో పెట్టి ఎక్కడికైనా తీసుకుని వెళ్లవచ్చు’ అని అంటున్నారు దీనిని రూపొందించిన ఏపీ నిట్ విద్యార్థులు. మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఎం.మనోజ్‌నాయక్, ఎం.అనీషా, కె.ప్రత్యూష, కె.రాజేశ్వరి, కె.గణవరప్రసాద్ బృందంగా ఏర్పడి ఆచార్యులు డాక్టర్ టి.కార్తికేయశర్మ మార్గనిర్ధేశంలో ఈ ఎలక్ర్టికల్ బైక్‌ను 20 రోజులపాటు శ్రమించి రూపొందించారు. వాహనాలు లేని ప్రదేశాలలో నడవలేని వారికి ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. ఈ వాహన రూపకల్పనకు రూ.20 వేలు ఖర్చయ్యిందన్నారు. విద్యార్థులను, వీరికి సూచనలు ఇచ్చిన ఆచార్యులు డాక్టర్ కార్తికేయశర్మను రిజిస్ట్రార్ దినేష్‌శంకర్‌రెడ్డి, డీన్ డాక్టర్ ఆర్‌కే.శాస్త్రి, డాక్టర్ జీబీ వీరేష్‌కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాదిపతి డాక్టర్ టి.బాబూరావు ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ జి.సంతోష్‌కుమార్, డాక్టర్ వి.సందీప్, డాక్టర్ ఎం.హైమావతి తదితరులు పాల్గొన్నారు.
– తాడేపల్లిగూడెం అర్బన్