Share News

అది ఇస్తే.. ఇదీ చేస్తాం..

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:32 AM

ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం ఐదు నెలల క్రితం పగ్గాలు చేపట్టింది. ఇలాంటి తరుణంలో టీడీపీతో సహా మిగతా పక్షాలు క్షేత్రస్థాయిలో తమ పార్టీ మరింత పటిష్టపరిచేం దుకే ఇప్పుడు ఊరూవాడా తిరుగుతున్నాయి.

అది ఇస్తే.. ఇదీ చేస్తాం..

పార్టీ సభ్యత్వానికి నామినేటెడ్‌ మెలిక

చాలాచోట్ల సీనియర్లలోనుతొంగి చూస్తున్న అసంతృప్తి

టీడీపీ టార్గెట్‌లో మూడో వంతే పూర్తి

లక్ష్యాన్ని చేరుకునేందుకుఎంపీ పుట్టా, గన్ని కార్యాచరణ

బీజేపీలోను ఇదే వరస

ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం ఐదు నెలల క్రితం పగ్గాలు చేపట్టింది. ఇలాంటి తరుణంలో టీడీపీతో సహా మిగతా పక్షాలు క్షేత్రస్థాయిలో తమ పార్టీ మరింత పటిష్టపరిచేం దుకే ఇప్పుడు ఊరూవాడా తిరుగుతున్నాయి. పార్టీలో చేరే వారందరికీ బీమా సౌకర్యం కల్పి స్తున్నాయి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నా యి. టీడీపీ ఆది నుంచి కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడంలో ముందు వరుసలో ఉంది. అయితే నామినేటెడ్‌ పదవులు దక్కలేదన్న అసంతృప్తి, అసహనం పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

సాధారణంగా ఎన్నికలకు ముందే అన్ని పార్టీల్లోను ఎక్కడాలేని ఉత్సాహం కన్పిస్తుంది. తమ పార్టీ గెలిస్తే తిరుగులేని సేవ చేస్తామంటూ తెగ హామీలు ఇస్తారు. కులం పేరిటో, నగదు పేరిటో వల విసురుతారు. కాని ఎన్నికలైన తర్వాత పార్టీ సభ్యత్వాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలన్నింటిలోను చలికాలంలో వేడి పుట్టి స్తోంది. ఉమ్మడి జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా టార్గెట్‌ పెట్టుకుని మరీ రంగంలోకి దిగారు. కూటమిలో తెలుగుదేశం సభ్యత్వ నమోదులో ఉరకలేస్తోంది. రెండేళ్లకొకసారి జరిగే సభ్య త్వ నమోదులో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కొంతమందికి బాధ్యతలు అప్పగించి అనుకున్న లక్ష్యాల మేర సభ్య త్వం పూర్తయ్యేలా ప్రతిసారి జాగ్రత్తపడుతూ వస్తోంది. ఈసారి కూడా టీడీపీ మిత్రపక్షాలు గెలిచిన నియోజక వర్గాల్లోను సభత్వ నమోదుకు ఎటువంటి ఢోకా లేకుం డా చూసేందుకు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా సరాసరిన నాలుగు లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునేలా లక్ష్యాన్ని పార్టీ నేతల ముందుం చింది. ఈనెల 16వ తేదీతో సభ్యత్వ నమోదు పూరి ్తకావాలని గత నెలలోనే పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలవగా, మిగతా మూడు చోట్ల జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కైవశం చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు టీడీ పీ లక్షన్నరకు పైగానే పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయగలిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యం చేరేందుకు పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులుతో పాటు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌లకు కొంత బాధ్యత అప్పగించింది. దీంతో తన పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎంపీ పుట్టా స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు గన్నిని వెంటపెట్టుకుని మరీ నియోజకవర్గాల వారీగా ప్రతీ రోజూ పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకు న్నారు. అనుకున్న లక్ష్యం సాధించాలంటే మరో రెండు న్నర లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్చాలి. ఈ క్రమంలో ఏ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా మిత్ర పక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోను పార్టీ సభ్య త్వాన్ని చురుగ్గా నిర్వహించేందుకు పరుగులు పెడుతు న్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఒనగూరే ప్రయోజ నాలను పార్టీ నాయకులంతా జనం చెవిన వేశారు. ఇప్పుడు తాజాగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న పోలవరం, ఉంగుటూరుతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కైకలూరులోను పార్టీ సభ్యత్వం మెరుగ్గా నమోదయ్యేం దుకు పుట్టా మహేశ్‌, గన్ని శరవేగంగా అడుగులు వేస్తున్నారు.

వాస్తవానికి ప్రతిసారి సభ్యత్వ నమోదులో దెందు లూరు నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్‌దే పైచేయిగా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఉన్న పక్కా నాయకత్వం ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పు డు సరి చేసుకుంటుంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థ సారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు సభ్యత్వ నమోదు భారీగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటు న్నారు. ఇదే తరుణంలో కిందిస్థాయి నేతలు, సీనియర్‌ కార్యకర్తల్లో కొంతమేర ఉత్సాహం తగ్గినట్టు కనపడడం నేతలను కలవరపెడుతోంది. నామినేటెడ్‌ పదవుల్లో తమకు, తమ ప్రాంతానికి ప్రాతినిధ్యం దక్కడం లేదన్న భావనలోనే పార్టీ నేతలు ఉన్నారు. జిల్లాకు సంబంధిం చి బొరగం శ్రీనివాస్‌కు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వ గా, జనసేన నేత అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ పదవి దక్కింది. మరికొంతమందికి డైరెక్టర్‌ పద వులు వరించాయి. ప్రత్యేకించి కొన్ని నియోజక వర్గాల కు కనీసం డైరెక్టర్‌ పదవులు కేటాయించలేని పరిస్థితి. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడ్డామని, ఆర్థికంగా కొంత కష్టనష్టాలు భరిం చామని, అయినా తమకు న్యాయం ఎందుకు చేయడం లేదని కొందరు ఆక్రోశిస్తున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న అనేక మంది తమకు అవ కాశం ఉండదని మదనపడుతున్నారు. పార్టీ మాత్రం కష్టపడిన వారెవ్వరికీ అన్యాయం జరగదని చెబుతున్నా అత్యధికులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే పదవు లు తక్కువ, ఆశించే వారు ఎక్కువ ఉన్న తరుణంలోఈ పరిస్థితి ఏర్పడిందని నచ్చచెబుతున్నా కొందరు తీవ్ర ఆవేదనలోనే ఉన్నారు. ఇదంతా పార్టీ సభ్యత్వ నమోదును ప్రభావితం చేసింది. అయితే వీరందరికీ నచ్చచెప్పి అనుకున్న లక్ష్యం అధిగమించాలన్న తాపత్రయం జిల్లా పార్టీలో ఉంది.

సర్దుబాటు చేస్తారా..

నియోజకవర్గాల వారీగా కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించినా క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమో దులో టీడీపీతో పాటు బీజేపీ బలంగానే పోటీ పడు తోంది. జిల్లాలో బీజేపీ ఇప్పటికే దాదాపు లక్షా 11 వేల సభ్యత్వంతో కాస్తంత ముందువరుసలోనే ఉంది. వాస్త వానికి బీజేపీ ఎప్పుడు సభ్యత్వ నమోదుకు దిగినా ఆశావహంగా నమోదు పెరిగేదేకాదు. ఈసారి కొంత నమోదులో ఉరుకులు పరుగులు పెడుతున్నా ఏలూరు ఎంపీ స్థానం తపనా చౌదరికి దక్కకపోవడంతో ఆ ప్రభావం కూడా ఏలూరు జిల్లాలో బీజేపీపై కనిపి స్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సర్దుబాటుకు బీజేపీ నేతలంతా ఇప్పుడు ఊరూవాడా తిరగాల్సి వస్తోంది. జనసేన పక్షాన గడిచిన రెండు నెలల క్రిత మే సభ్యత్వ నమోదు పూర్తయ్యింది. ఆ పార్టీ కూడా గడిచిన పదేళ్లల్లో ఎన్నడూ లేనంతగా కొంతలో కొంత సభ్యత్వ నమోదును వేలల్లోనే నమోదు చేయగలిగింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లక్ష్యంగానే ఆ పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగించింది. దీనికి తోడు తెలు ుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు వెనకడుగు వేయకుం డా తమ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరికీ బీమా వర్తించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో కొంతలో కొంత ఆదరణ పెరిగింది.

Updated Date - Nov 15 , 2024 | 12:32 AM