Share News

నామినేషన్ల వెల్లువ

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:43 AM

సార్వత్రిక ఎన్నికలల్లో భాగంగా ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్‌ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. 25న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు స్వీకరిస్తారు.

నామినేషన్ల వెల్లువ

ఎంపీ స్థానానికి 5.. అసెంబ్లీ స్థానాలకు 35

నేటితో ముగియనున్న గడువు..29 వరకు ఉపసంహరణ గడువు

ఏలూరు సిటీ/ ఉంగు టూరు/ దెందులూరు/బుట్టాయ గూడెం/ నూజివీడు/ కైక లూరు, ఏప్రిల్‌ 24 : సార్వత్రిక ఎన్నికలల్లో భాగంగా ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్‌ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. 25న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు స్వీకరిస్తారు. అనం తరం పోటీలో ఉన్న అభ్యర్థులను గుర్తులను కేటాయించనున్నారు. కాగా బుధవారం 6వ రోజున జిల్లాలో మొత్తం 40 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు పార్లమెంటరీ నియో జక వర్గానికి సంబంధించి ఐదుగురు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి 35 మంది తమ నామినేషన్లును ఆర్వోలకు దాఖలు చేశారు. ఏలూరు పార్లమెంటరీ నియోజక వర్గానికి యువతరం పార్టీ అభ్యర్థిగా గుగులోతు బాబు, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా బైరబోయిన మాల్యాద్రి, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా నిట్టా అఖిల్‌ ధరణీపాల్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీ అభ్యర్ధిగా గొడుగుపాటి వీర రాఘవులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పుట్టా మహేష్‌కుమార్‌ నామినేషన్లను దాఖలు చేశారు. ఉంగుటూరు నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నేకూరి ఆశీర్వాదం, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోట్ల ధర్మరాజు, వైసీపీ అభ్యర్థులుగా పుప్పాల శ్రీని వాసరావు, పుపాల ఆదివల్లి రమణి తమ నామినేషన్లు దాఖలు చేశారు. దెందులూరు ఉంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నూతి రవీంద్ర గౌడ్‌, నూతి నాగరాజు, పచ్చిగొళ్ళ జాన్‌ ధర్మరాజు, చెరుకూరి శ్రీరామ్‌కుమార్‌, వైసీపీ అభ్యర్థులుగా కొఠారు రామచంద్ర రావు, కొఠారు అబ్బయ్య చౌదరి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆలపాటి నరసింహమూర్తి నామి నేషన్‌ వేశారు. ఏలూరు నుంచి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా అల్లూరి సత్య నారాయణ రాజు, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా అందుగుల రతన్‌కాంత్‌, ఇండిపెండెంట్‌గా రాజనాల శ్రీనివాసరావు నామినేషన్‌లు దాఖలు చేశారు. పోలవరం నుంచి వైసీపీ అభ్యర్థులుగా తెల్లం రాజ్యలక్ష్మి, తెల్లం బాలరాజు, జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు, ఇండిపెండెంట్‌గా కొవ్వాసు జగదీశ్వరి నామినేషన్‌ వేశారు. చింతలపూడి నుంచి టీడీపీ అభ్యర్థులుగా సొంగా రోషన్‌కుమార్‌, సొంగా ఇసాక్‌ రాజ్‌, ఇండి పెండెంట్‌లుగా తొర్లపాటి శ్రీనివాసరావు, వెంపా దుర్గారావు, కలపాల ప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నమట్ల రాకడ ఎలీజా తమ నామినేషన్లు దాఖలు చేశారు. నూజివీడు తెలుగుదేశం అభ్యర్థిగా కొలుసు పార్థసారథి నామినేషన్‌ పత్రాలను ఆర్వో వై.భవానీ శంకరికి అందించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ ర్యాలీలో పాల్గొని పాల్గొని సంఘీభావం తెలిపా రు. ఇండిపెండెంట్‌లుగా పాము రవీంద్రనాథ్‌, చలిగంటి వెంకటేష్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరీదు కృష్ణ తమ నామినేషన్లు దాఖలు చేశారు. కైకలూరు బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్‌, ఇండిపెండెంట్‌లుగా గునుకుల నారాయణ, తిరువీధుల శారద, బొడ్డు కిరణ్‌కుమార్‌, వైసీపీ అభ్యర్థులుగా తిరువీధుల శారద, దూలం నాగేశ్వరరావు, దూలం వీరకుమారి తమ నామినేషన్లును దాఖలు చేశారు.

చింతమనేనికి బీ ఫామ్‌ అందించిన చంద్రబాబు

పెదవేగి, ఏప్రిల్‌ 24 : దెందులూరు నియోజక వర్గం నుంచి కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా చింతమనేనికి ప్రభాకర్‌కు బుధవారం టీడీపీ అధి నేత చంద్రబాబు నాయుడు బీ–ఫామ్‌ అందిం చారు. చింతమనేనికి మంగళవారం రాత్రి చంద్రబాబు ఫోన్‌ చేసి బుధవారం శ్రీకాకుళం వచ్చి బీ–ఫామ్‌ తీసుకెళ్ళమని సమాచారం ఇచ్చారు. దీంతో బుధవారం ఉదయం హుటాహుటీన శ్రీకాకుళం వెళ్లి పార్టీ అధినేత నుంచి పార్టీ బీ–ఫామ్‌ అందుకున్నారు. దీంతో కొద్దిరోజులుగా టిక్కెట్‌ చింతమనేనికి వస్తుందా లేక పొత్తులో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి (గారపాటి చౌదరి)కి దక్కుతుందా అన్న ఉత్కంఠకు పూర్తిగా తెర పడింది.

Updated Date - Apr 25 , 2024 | 12:43 AM