చిరస్మరణీయుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:51 PM
ఎన్టీ రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని పలువురు వక్తలు అన్నారు. జిల్లాలో పలుచోట్ల ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు గురువారం నిర్వహించారు.
వర్ధంతి కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తల నివాళి
జంగారెడ్డిగూడెం, జనవరి 18: ఎన్టీ రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని పలువురు వక్తలు అన్నారు. జిల్లాలో పలుచోట్ల ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ కృష్ణ, మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులరించారు. 23వ వార్డులో మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ ముస్తఫా, తూటికుంట దుర్గారావు, బైపాస్‌లో చెరుకూరు శ్రీధర్, సంత మార్కెట్‌లో చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మార్కండేయపురం, ఎన్టీఆర్ నగర్, బుట్టాయిగూడెం రోడ్‌లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూల దండలు వేసి ఘననివాళులర్పించారు. తూటికుంట రాము, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, ఆకుమర్తి రామారావు, కొంచాడ ఉమాప్రసాద్, తెలగారపు జ్యోతి, రాజాన సత్యనారాయణ, పగడం సౌభాగ్య వతి, గుళ్ళపూడి శ్రీదేవి పాల్గొన్నారు. లక్కవరంలో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్య నారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆస్పత్రి లో రోగులకు పాలు, రొట్టెలు, బిస్కట్లు పంపిణీ చేశారు.
బుట్టాయగూడెం: ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కొమ్ముగూడెం సెంటరులోని ఎన్టీ రామారావు విగ్రహానికి టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. రెడ్డిగణపవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. మొగ పర్తి సోంబాబు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె అబ్బులు, కుందుల శ్రీను, మానెల్లి బాబు, మాటూరి ముసలయ్య, మడకం రామకృష్ణ, దెయ్యాల కృష్ణమోహన్, మొడియం సూర్యచంద్రరావు, బొబ్బర ఎలీషా, భౌమరాజు ధనుంజయరాజు, చిలకమూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి: మండలంలో పి.రాజవరం, పి.అంకంపాలెం, రాచన్నగూ డెం, ములగలంపల్లి, పాములవారిగూడెం, దర్భగూడెం, కామయ్యపాలెం, జీలుగుమిల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపి రూ.10వేలు అర్ధిక సాయం అందజేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి, నాలి శ్రీను, బి.రాజబాబు, ఉండవల్లి సోమసుందరం, గూడపాటి పుల్లయ్య, యాండ్ర శేఖ ర్, జాస్త్రి సత్యనారాయణ, బొలగాని అఖిల్, చీమకుర్తి శ్రీనివాస్, ఆర్.శివాజీ, పూసం అర్జునరావు, తమ్మన సాంబ, పీతల వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
చింతలపూడి: చింతలపూడి, ప్రగడవరం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పక్కాల వెంకటేశ్వరరావు, బోడా నాగభూషణం, బొమ్మాజీ అనిల్, సొంగా రోషన్‌కుమార్, చిట్టూరి ధర్మరాజు, మారుమూడి థామస్, యాళ్ళ లీలాప్రశాంతి, కొత్తపూడి శేషగిరిరావు, తాటి అప్పారావు, ప్రగడవరంలో తాళ్ళూరి చంద్రశేఖర రెడ్డి, రాజశేఖరరెడ్డి, వీర్రాజు, కొప్పెర్ల నాగరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టి.నరసాపురం: మండలంలోని తెడ్లం, రాజు పోతేపల్లి, బొర్రంపాలెం, ఏపిగుంట గ్రామాలల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు, టి.నరసాపురంలో ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయ్యవరపు శ్రీ రామమూర్తి, శీలం వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకట చలపతిరావు, తోట లక్ష్మీనారాయణ, అద్దంకి జగ్గారావు, జోనుబోయిన సోంబాబు, బండి శ్రీనివాసరావు, పెద్దిన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు: భీమడోలు సంతమార్కెట్, పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దౌలూరి మరియన్న ఆర్ధిక సాయంతో 20 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. శిరిబత్తిన కొండబాబు, దోసనపూడి పుల్లయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: మండలంలోని కైకరం, ఉంగుటూరు, వెల్లమిల్లి, రావులపర్రు, యర్రమళ్ల, ఎ.గోకవరం, నల్లమాడు సీతారాంపురం, తదితర గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు, పాతూరి విజయకుమార్, రెడ్డి చందు, చింతల శ్రీనివాస్, నల్లా ఆనంద్, బండారు మధు, ఇమ్మణ్ణి గంగాధరరావు, కడియాల రవిశంకర్, గంటా యువరాజు, దండమూడి ఉషారాణి, పసుపులేటి నరసింహరావు, ఉన్నమట్ల సునీత, బండి స్వరూప్, అక్కిన నాగమణి, యెగ్గిన శ్యామల తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి: ఎన్టీ రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయ ణ, మాగంటి నారాయణప్రసాద్, నంబూరి నాగరాజు, మోరు శ్రావణి, గార పాటి రామసీత, చింతమనేని సతీష్, దేవరపల్లి ఆదామ్ పాల్గొన్నారు.