పీఏసీ చైర్మన్ అంజిబాబుకు ఘన సత్కారం
ABN , Publish Date - Nov 24 , 2024 | 11:51 PM
సౌమ్యులు, స్నేహశీలి, ప్రజాసేవకు పరితపించే మనస్తత్వం గలవారు ఎమ్మెల్యే అంజిబాబు అని, అటువంటి వ్యక్తికి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించడం శుభ పరిణామమని జాతీయ కాపు సంఘం నాయకులు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు యర్రంశెట్టి శివకృష్ణ అన్నారు.
భీమవరంటౌన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) :సౌమ్యులు, స్నేహశీలి, ప్రజాసేవకు పరితపించే మనస్తత్వం గలవారు ఎమ్మెల్యే అంజిబాబు అని, అటువంటి వ్యక్తికి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించడం శుభ పరిణామమని జాతీయ కాపు సంఘం నాయకులు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు యర్రంశెట్టి శివకృష్ణ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబును సత్క రించారు. ఆయన మాట్లాడుతూ కేబినెట్ హోదా కలిగిన పదవి రావడం ఆనందదాయకమన్నారు. జాతీయ కాపు సంఘం సెంట్రల్ ఉపాధ్యక్షుడు జడ్డు శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపోలు ఆంజనేయులు, యర్రంశెట్టి నాగసాయి, యర్రం శెట్టి బ్రహ్మాజీ, యర్రంశెట్టి శ్రీనివాసరావు, జీవీ ఎస్ నాయుడు, నల్లం అన్నపూర్ణ, వర్ధినీడి వెంకటలక్ష్మి, గంధం చిన్నా పాల్గొన్నారు.
గాదిరాజు బాబు అభినందనలు
రాష్ట్ర పీఏసీ ఛైర్మన్‌గా నియమితులైన పుల పర్తి రామాంజనేయులును మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గాదిరాజు సత్యనారాయణరాజు అభినందించారు. ఆయన మాట్లాడుతూ అంజి బాబు మంచి రాజనీతిజ్ఞుడు అన్నారు ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మల్లినీడి అభినందనలు
అపర చాణక్యుడు ఎమ్మెల్యే అంజిబాబు అని జనసేన రాష్ట్ర ప్రొటొకాల్ చైర్మన్ మల్లినీడి తిరు మలరావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో ఎమ్మెల్యే అంజిబాబును కలిసి అభినం దనలు తెలిపారు. నాయకులు పిల్లా నారాయణ మూర్తి, చిరంజీవి ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లా రాము, యాస అనిల్, కొప్పినీడి బాబి, మాదాసు సాయి, యాడ్లపల్లి రాంబాబు పాల్గొన్నారు