Share News

కొరవడిన సహకారం!

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:15 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్వహణ లోప భూయిష్టంగా మారింది. సహకార వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా సంఘాల పాలన జరుగుతున్నది. ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ కమిటీల ఏలుబడిని కొన సాగి స్తుండటంతో సంఘాల సాధారణ పాలన, నిర్ణయాలు, ఆర్థిక నిర్వహణ లోప భూయిష్టంగా ఉంటోంది.

కొరవడిన సహకారం!

సందిగ్ధంలో సహకార సంఘాలు

ఆరేళ్లుగా ఎన్నికలు లేవు

నామినేటెడ్‌ కమిటీల ఏలుబడిలో అంతా ఏకపక్ష పాలన

నష్టాల బారిన పీఏసీఎస్‌లు

ముదినేపల్లి, జూన్‌ 26 :

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్వహణ లోప భూయిష్టంగా మారింది. సహకార వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా సంఘాల పాలన జరుగుతున్నది. ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ కమిటీల ఏలుబడిని కొన సాగి స్తుండటంతో సంఘాల సాధారణ పాలన, నిర్ణయాలు, ఆర్థిక నిర్వహణ లోప భూయిష్టంగా ఉంటోంది. సంఘాల సభ్యులతో ఎన్నిక కాబడిన పాలకవర్గం లేకపోవడం, ఐదేళ్ల పాటు నామినేటెడ్‌ కమిటీలనే కొనసాగించడంతో సంఘాల పాలిట శాపంగా మారింది.

సహకార రంగ చరిత్రలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఆరేళ్లుగా ఎన్నికలు జరగలేదు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికైన పాలకవర్గ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిం చగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పీఏసీఎస్‌ల ఎన్నికల జోలికే వెళ్లలేదు. ఐదేళ్ల పాటు త్రిసభ్య నామినేటెడ్‌ కమిటీలనే కొనసాగిం చింది. దీంతో సంఘాలు వైసీపీ నేతల ఆధీనంలోనే ఉండి పోయాయి. సంఘాల్లో ఏ జరుగుతున్నదో తెలియని పరి స్థితి ఏర్పడింది. పలు సంఘాల్లో సిబ్బందిని తమ ఇష్టా నుసారంగా తొలగించినట్టు తెలిసింది. సహకార సంఘా లకు చివరిసారిగా 2013 ఎన్నికలు జరిగాయి. నామినేటెడ్‌ కమిటీల నియామకం సహకార చట్టానికే విరుద్ధం. అయి నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు నామినేటెడ్‌ కమిటీలనే కొనసాగించింది. దీంతో బాధ్యతగా వ్యవహరించే పాలక వర్గాలు లేకుండా పోయాయి.

డీసీసీబీకీ నామినేట్‌

పీఏసీఎస్‌లకే కాకుండా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌కూ డైరెక్టర్లు, చైర్మన్‌లను వైసీపీ ప్రభుత్వం నామి నేట్‌ చేసేసింది. సంఘ సభ్యుల ద్వారా పీఏసీఎస్‌లకు చైర్మన్‌గా ఎన్నికై డీసీసీబీకి డైరెక్టర్లుగా ఎన్నిక కావాలి. ఆ డైరెక్టర్లలో ఒకరిని డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. పీఏసీఎస్‌లకు నామినేటెడ్‌ కమిటీలను వేయడంతో డీసీ సీబీకి ఆ నామినేటెడ్‌ కమిటీల్లోని ఒక సభ్యుడిని చైర్మన్‌గా ప్రభుత్వం నామినేట్‌ చేసి ఐదేళ్లు గడిపేసింది. అంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని ఒక పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీలో సభ్యుడిగా నియమించి జిల్లా స్థాయి బ్యాంక్‌కు చైర్మన్‌గా నియమించడం సహకార స్ఫూర్తిని దెబ్బతీసినట్టయింది.

నష్టాల బారిన సొసైటీలు

పీఏసీఎస్‌లు నష్టాల బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాబార్డు రుణ సౌకర్యంతో సంఘాల పరిధిలో నిర్మించనున్న గొడౌన్ల నిర్మాణం మరింత నష్టం తెచ్చి పెడుతున్నది. సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల రుణంతో కేంద్ర ప్రభుత్వం సంఘాల్లో గొడౌన్లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు. ఒకవేళ నిర్మించినా దానిని రైతులు వినియోగించకపోతే సంఘాలకు ఆదాయం రాదు. రుణం వాయిదాల ప్రకారం సంఘం చెల్లించాల్సిందే. దీనివల్ల సంఘం ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. రైతులు వినియోగించుకోలేని ప్రదేశాల్లో గొడౌన్ల నిర్మాణం చేశారు. అదీ త్రిసభ్య కమిటీల నిర్వాకమే.పూర్తికాని కంప్యూటరీకరణ

పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పూర్తి కాలేదు. సంఘాల రికార్డులు కంప్యూటరీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేయలేదు. కంప్యూటరీ కరణకు ఖర్చును కేంద్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర సహకార బ్యాంకు సంయుక్తంగా భరించాలి. అయితే ఈ ఖర్చును సంఘాలే భరించాల్సి రావడంతో ఆర్థిక భారం పెరిగింది. ఇప్పటికే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న చాలా సంఘాలకు గొడౌన్ల నిర్మాణ రుణ వాయిదాలు చెల్లిం చడం, కంప్యూటరీకరణకు అయ్యే ఖర్చును భరించడం నష్టాలు తెచ్చి పెడుతున్నాయి.

Updated Date - Jun 27 , 2024 | 12:15 AM