Share News

రోడ్డుపైనే ధాన్యం

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:15 AM

ఖరీఫ్‌లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందు కు రైతులు తంటాలు పడుతు న్నారు.

 రోడ్డుపైనే ధాన్యం
తిమ్మారావుగూడెంలో చిరిగిపోయిన గోనెసంచుల్లోనే ధాన్యం

ఏలూరు రూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి) : ఖరీఫ్‌లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందు కు రైతులు తంటాలు పడుతు న్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధం గా ఉన్నా అధికారులు సరైన ప్రణాళికను అమ లు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సిబ్బంది కొరత, ఖాళీ సంచుల లోటు వేధిస్తున్నాయి. ఏలూరు రూరల్‌ మండలంలో సుమారు 16 వేల ఎకరా ల విస్తీర్ణంలో వరిసాగు అయింది. ఇటీవల అల్పపీడనం కారణంగా వర్షం కురిసింది. పొలాల్లో ధాన్యం నూర్చి కల్లాలు, లేఅవుట్‌ స్థలాలు, రహదారుల వెంబడి ఆరబెట్టారు.

మరో రెండు రోజులు ఆర బెట్టుకుని మిల్లులకు విక్రయించ వచ్చని రైతు లు భావిస్తు న్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తగి నన్ని సంచులను సమకూర్చలేదు. ఆన్‌ లైన్‌లో 45 కిలోల బస్తాకు మాత్రమే అనుమతి ఉంది. ఆ సంచులను సరఫ రా చేయలేదు. ఖాళీ సంచులు ఇచ్చినా ఎక్కువశాతం చిరిగిపోయాయి.

Updated Date - Dec 27 , 2024 | 01:15 AM