Share News

ధాన్యం కొనుగోళ్లలో రికార్డ్‌

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:23 AM

రైతుల కష్టాలు తీరుస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తూ అంతే వేగంతో వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత సజావుగా ఏ సీజన్‌లోనూ ఽసేకరించలేదు.

ధాన్యం కొనుగోళ్లలో రికార్డ్‌
ఇరగవరంలో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు

కృష్ణా నుంచి పశ్చిమకు తడిసిన ధాన్యం దిగుమతి

ప్రభుత్వ నిర్ణయం.. అంగీకరించిన జిల్లా మిల్లర్లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రైతుల కష్టాలు తీరుస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తూ అంతే వేగంతో వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత సజావుగా ఏ సీజన్‌లోనూ ఽసేకరించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి రైతులకు జోష్‌ నింపింది. కృష్ణా జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయ డానికి చర్యలు తీసుకుంది. పశ్చిమకు దిగుమతి చేస్తోంది. మిల్లర్లు ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడ్డారు. ఫలితంగా దాదాపు 20 వే ల టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటి వరకు 10 వేల టన్నులు వచ్చాయి. డ్రయ్యర్‌ల ద్వారా వాటిని ఆర బెడుతున్నారు. ఇలా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

జిల్లాలో 2 లక్షల టన్నులు

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 4.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే సొమ్ములు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి రూ.460 కోట్లు చెల్లించాలి. రూ.450 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో రూ.10 కోట్లు మాత్రమే బకాయి ఉంది. శనివారం ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా 24 గంటల వ్యవధిలో ప్రభుత్వం సొమ్ము చెల్లించడం ఇది తొలిసారి. గతంలో నిధులను దారి మళ్లించేవారు. వైసీపీ హయాంలో పెద్ద మొత్తం లోనే నిధులు దారి మళ్లాయి. ధాన్యం సేకరించే సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపో యింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపో యారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతు లు నానా తంటాలుపడ్డారు. చివరకు సొమ్ములు చెల్లిం పుల్లోనూ వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. నెలల తరబడి బకాయిలు పడింది. రైతులు ఆర్థికంగా ఇబ్బం దులు పడ్డారు. వ్యవసాయాధారిత వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం కుదుటపడింది.

పల్లెల పండుగ వాతావరణం

ధాన్యం మసూళ్లు, అమ్మకాలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయ కూలీలకు చేతి నిండా పనిదొరుకుతోంది. రవాణా రంగానికి కాస్త ఊర ట లభించింది. ధాన్యం ఒబ్బిడి అయిన మరుక్షణమే మిల్లులకు చేరిపోతున్నాయి. ఈ ఏడాది ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నాయి. పల్లెలు ధాన్యం రాశులతో కలకలలాడుతు న్నాయి. అమ్మకాలతో సందడి నెలకొం ది. అదే జోష్‌తో రైతులు రబీ సాగుకు సిద్ధమవుతు న్నారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించ డంతో సేకరణ వేగవంతం అవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో అధికారులకు రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఒకటి రెండుచోట్ల కమీషన్‌ దారులే మధ్యలో హడావిడి చేసిన సందర్భాలున్నాయి. వాటిని తక్షణమే అధికారులు పరిష్కరించారు. అంతే తప్పా ధాన్యం కొనుగోళ్లు, సొమ్ముల జమ విషయంలో రైతులు పూర్తి సంతృప్తితో ఉన్నారు. వ్యవసాయ అనుబంధ వ్యాపారుల్లోనూ సందడి నెలకొంది.

మిల్లర్ల ఎదురుచూపు

రైతులపై సానుకూలతతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం తమ బకాయిల విడుదలలోనూ అదే ధోరణిని అవలంభిస్తుందన్న మిల్లర్లు ఆశాభావంతో ఉన్నారు. జిల్లాలో రూ.200 కోట్లకుపైగా ప్రభుత్వం బకాయి పడింది. వైసీపీ హయాంలో వీటిని చెల్లిం చకుండా పూర్తిగా చేతులెత్తేసింది. రవాణా, కస్టమ్‌ మిల్లింగ్‌, డ్రయ్యర్‌, షార్టెక్స్‌ ఛార్జీలను చెల్లించకపో వడంతో వీటి కోసం మిల్లర్లు ఆశగా ఎదురుచూ స్తున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:23 AM