Share News

కొర్రీలెందుకో..?

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:36 AM

జిల్లాలో ధాన్యం దిగుబడులు అధికం. ఖరీఫ్‌లో సగటున 40 బస్తాలు, రబీలో 55 నుంచి 60 బస్తాలు దిగుబడి వస్తుంది. అయితే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో గత ఏడాది రబీ నుంచి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.

కొర్రీలెందుకో..?

ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు

రైతుకు 12.5 ఎకరాలే పరిమితి

గ తంలో 25 ఎకరాలకు ఈ క్రాప్‌ వర్తింపు

గడచిన రబీ నుంచి తొలగింపు

ఎకరానికి 40 బస్తాల ధాన్యం అమ్ముకునే వెసులుబాటు

రబీలో అంతకుమించి ఉత్పత్తులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం దిగుబడులు అధికం. ఖరీఫ్‌లో సగటున 40 బస్తాలు, రబీలో 55 నుంచి 60 బస్తాలు దిగుబడి వస్తుంది. అయితే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో గత ఏడాది రబీ నుంచి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. 25 ఎకరాల వరకు వున్న ఈ క్రాప్‌ నమోదు పరిమితిని 12.5 ఎకరాలకు కుదించడంతో అధిక భూములున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆచంట, తాడేపల్లిగూడెం, గణపవరం వంటి ప్రాంతాల్లో అధిక భూములున్న రైతులు ధాన్యం విక్ర యించడానికి ఇబ్బందులు పడుతున్నారు.

రబీలో ఎకరానికి 60 బస్తాల వంతున ధాన్యం పండుతోంది. ఈ లెక్కన ఈ క్రాప్‌లో 12.5 ఎకరాలు నమోదు చేసినా ఫలితం లేకపోతోంది. కేవలం ఎనిమిది ఎకరాల్లో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని మాత్రమే విక్రయిం చగలుగుతున్నారు. ప్రభుత్వం ఎకరానికి 40 బస్తాల ధాన్యాన్ని పరిమితం చేయడంతో ఇదీ సమస్యగా మారింది. అంతకుమించి వెసులుబాటు కల్పించే అవ కాశం లేదు. గతంలో 25 ఎకరాల పరిమితి వుంటే ఇబ్బంది ఉండేది కాదు. అధిక దిగుబడులు సాధించినా ప్రభుత్వానికి అమ్ముకునే సదుపాయం ఉండేది. రబీ నుంచే సమస్య ఎదురవుతోంది. అధిక భూములున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

ఈ క్రాప్‌ పరిమితులపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఉన్నతాధికా రుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తు న్నారు. క్షేత్రస్థాయిలో అధిక భూములు వున్న రైతులను గుర్తించి, వీరి జాబితాను ప్రభుత్వానికి పంపి అనుమ తులు తీసుకుందామన్న ఆలోచనతో అధికారులు ఉన్నా రు. ఈ క్రాప్‌ పరిమితి పెంచితే ఇబ్బందులు ఉండేవి కాదు. ప్రతి సీజన్‌లోనూ అనుమతులు తీసుకోవాలంటే కష్టతరమవుతుంది. ధాన్యం విక్రయించడంలో జాప్యమ వుతోంది. ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం క్షేత్రస్థాయి లో పరిశీలించి వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఇతర రాష్ర్టాల్లోనూ పరిమితులు

ఈ క్రాప్‌ విధానంపై ఒక్కో రాష్ట్రం ఒక విధానాన్ని అమలుచేస్తోంది. కొన్ని రాష్ర్టాల్లో రైతులు 7.5 ఎకరాల కు మాత్రమే ఈ క్రాప్‌ చేసుకునే వెసులుబాటు ఇచ్చా రు. ఆ లెక్కన రాష్ట్రంలో 12.5 ఎకరాలు కాస్త ఉపశమ నం కలిగించినట్టే. జిల్లాలో ధాన్యం ఉత్పత్తులు అధికం కావడంతో మొత్తం ఉత్పత్తులను విక్రయించాలంటే ప్రభుత్వ షరతులు ఆందోళన కలిగిస్తున్నాయి. సన్న, చిన్న కారు రైతులకు ఇబ్బంది లేదు. ప్రతి ఊరిలోను కొద్ది మంది రైతులకు ప్రభుత్వ షరతులు అవరోధంగా మారాయి. దీనిపై వ్యవసాయశాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్‌లోనూ చర్చ సాగుతోంది. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ కొనుగోలు దుర్వినియోగం అవుతుందన్న అను మానాలు ఉన్నాయి. ఒక్కోసారి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇలా దిగుమతి చేసుకున్న ధాన్యాన్ని ఇక్కడ రైతుల పేరుతో ప్రభుత్వానికి అమ్మకాలు సాగిస్తున్నారు. ఒడిశా, చత్తీస్‌ ఘడ్‌ రాష్ర్టాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతయ్యేవి. దిగుమతి చేసుకున్న జిల్లాలో తూర్పు గోదావరి ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒడి శా వంటి రాష్ర్టాల్లో బోనస్‌ ప్రకటించారు. ఇక్కడికంటే ఆ రాష్ట్రంలోనే అధిక ధర వచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో దిగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కో సారి మన రాష్ట్రం నుంచే ఒడిశా వ్యాపారులు కొను గోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ క్రాప్‌ వెసులుబాటు కల్పించినంత మాత్రాన ఇబ్బందు లు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లాలో ప్రతి సీజన్‌లోనూ లక్ష్యాన్ని చేరుకుంటు న్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో దాదాపు నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం వబ్బిడి చేసిన వెంటనే మిల్లులకు చేరిపోతున్నా యి. అంతేవేగంగా సొమ్ములు రైతుల ఖాతాల్లో జమవు తున్నాయి. ఈ విషయంలో రైతుల్లో జోష్‌ నెలకొంది. పరిమితి తగ్గించడంతోనే కొందరు రైతులు అమ్మకానికి తంటాలు పడుతున్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

పెంటపాడు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ రైతు సేవా కేంద్రాలలోనే రైతులు ధాన్యం అమ్మకాలు సాగించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు’ అని సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ మంజీర్‌ జిలాని సమూన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రత్తిపాడులోని రైతులతో ఆయన మాట్లాడారు. సార్వాలో ఎకరానికి దిగుబడి ఎంత వచ్చింది ? ధాన్యం అమ్మిన ఎన్ని గం టల్లో సొమ్ములు జమవుతున్నాయి ? తదితర అంశా లపై మాట్లాడారు. తేమ శాతం ఇబ్బంది లేకుండా ధా న్యాన్ని అరబెట్టుకుని అమ్మకాలు జరుపుకోవాలన్నారు. ప్రత్తిపాడులో రైల్‌మిల్లులను పరిశీలించి ధాన్యం మిల్లింగ్‌, నూకలు తదితర అంశాలను పరిశీలించారు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు సంచి కి 41 కేజీల ధాన్యం తూకం చేస్తున్నారని, దీనివల్ల నష్టం కలుగుతోందన్నారు. ధాన్యం 40 కేజీలు, సంచి బరువు 600 గ్రాములు మొత్తం 40.600 కేజీలు తూస్తే సరిపోతుందన్నారు. జిల్లా వ్యవ సాయశాఖా ధికారి జెడ్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖతీబ్‌కౌసర్‌బనో, సివిల్‌ సప్లై డీఎం శివరాంప్రసాద్‌, డీఎస్‌వో సరోజిని, ఏడీఏ మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పాలకోడేరు: గరగపర్రులోని ధాన్యం కొనుగోలు కేం ద్రాలను జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, గొరగనమూడిలో ఆర్‌డీవో ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతా ల్లో సొమ్ము జమ చేస్తున్నట్టు జేసీ తెలిపారు.

Updated Date - Nov 23 , 2024 | 12:36 AM